Razakar : రజాకార్ సినిమాపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

నిజాం సంస్థానం భారదేశంలో ఎలా విలీనమైంది అనే క‌థాంశంతో తెరకెక్కిన చిత్రం రజాకార్.

Bandi Sanjay Comments on Razakar Movie

నిజాం సంస్థానం భారదేశంలో ఎలా విలీనమైంది అనే క‌థాంశంతో తెరకెక్కిన చిత్రం రజాకార్. గ‌తేడాది మార్చి 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి విజ‌యాన్ని అందుకుంది. బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించిన ఈ చిత్రానికి యాట‌ సత్యనారాయణ దర్శకత్వం వ‌హించారు. గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం జ‌న‌వ‌రి 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సంద‌ర్భంగా కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ మాట్లాడుతూ.. కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని, మన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించిన మూవీ రజాకార్ అని అన్నారు.

SS Thaman : అలా సంపాదించిన డబ్బులన్నీ ఛారిటీకే.. ఈ విషయంలో తమన్ ని మెచ్చుకోవలసిందే..

రజాకార్ల దురాగతాలను ఎదురించడానికి ప్రజలే సాయుధులై కదన రంగంలో దిగిన యదార్థ కథ ఇది. చరిత్ర పుటల్లో దాగిన ఈ నెత్తురు జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిన మూవీ ఇది అని అన్నారు. నిజాం హయాంలో జరిగిన మారణహోమాన్ని, హిందువులపై జరిగిన దౌర్జన్యాలను, బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు ప్రజలే సాయుధులై ఎలా పోరాటం చేశారో ఈ చిత్రంలో చూపించార‌న్నారు.

Director Sukumar : ద‌ర్శ‌కుడు సుకుమార్‌కు ఐటీ అధికారుల‌ షాక్‌.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఇంటికే..

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆర్థిక నష్టాలు ఎదురైనా భయపడకుండా గూడూరు నారాయణ రెడ్డి నిర్మించార‌న్నారు. ఈనెల 24 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ఈ చిత్రం చూడాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు.