BHAAG SAALE Trailer : తెలంగాణ అంటే కేసీఆర్‌కు ఎంతిష్టమో.. నువ్వంటే అంత ఇష్టం
శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న చిత్రం భాగ్ సాలే. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నేహా సోలంకి కథానాయిక.

BHAAG SAALE Trailer
BHAAG SAALE Trailer : శ్రీసింహా కోడూరి (Sri Simha Koduri) హీరోగా నటిస్తున్న చిత్రం భాగ్ సాలే. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రైమ్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నేహా సోలంకి (Neha Solanki) కథానాయిక. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. జూలై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా నేడు చిత్ర ట్రైలర్ ను హీరో కార్తికేయ విడుదల చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా విచ్చేసిన కార్తికేయ మాట్లాడుతూ.. ట్రైలర్ చూశాను. ఎంతో బాగుంది. ఈ ట్రైలర్ చూశాక టైటిల్ బాగా సెట్టయిందని అనిపించింది. సినిమాలోని అన్ని పాత్రలు ఎనర్జీతో ఉన్నాయి. ఇప్పటి వరకు భాగ్ సాలే అంటే మహేష్ బాబు పాట గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడీ సినిమా గుర్తుకొస్తుందన్నారు. తన ఇంట్లో ఎంతో మంది గొప్ప టెక్నీషియన్స్ ఉన్నా..శ్రీసింహా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని సింప్లిసిటీ నాకు బాగా నచ్చుతుందన్నారు. ఈ చిత్రం శ్రీ సింహాకు మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకున్నారు.
సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ.. ఈ సినిమాకు పని చేస్తున్నప్పుడు మంచి ఫన్ తో ఎంటర్ టైనింగ్ గా రెండు గంటల సమయం సరదాగా తెలియకుండా గడిచిపోయింది. రేపు థియేటర్ లో ప్రేక్షకులకు కూడా ఇలాంటి అనుభూతే కలుతుందున్నారు. ఈ ఫన్ ను మిస్ కావొద్దు. థియేటర్ కు వచ్చి చూడాల్సిందేనని అన్నారు.