Bhagavanth Kesari Release date: బాల‌య్య అభిమానుల‌కు ఆ రోజు పూన‌కాలే.. భ‌గ‌వంత్ కేస‌రి రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

నందమూరి న‌ట సింహం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. బాల‌య్య‌కు జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal) న‌టిస్తోండ‌గా శ్రీలీల(Sreeleela) కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Bhagavanth Kesari Release date: బాల‌య్య అభిమానుల‌కు ఆ రోజు పూన‌కాలే.. భ‌గ‌వంత్ కేస‌రి రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

Bhagavanth Kesari

Updated On : July 22, 2023 / 3:04 PM IST

Bhagavanth Kesari : నందమూరి న‌ట సింహం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. బాల‌య్య‌కు జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal) న‌టిస్తోండ‌గా శ్రీలీల(Sreeleela) కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. థ‌మన్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.

Baby Movie : బేబీ సరికొత్త రికార్డు.. 50 కోట్ల కలెక్షన్స్.. వారం రోజుల్లోనే..

ఇదిలా ఉంటే.. గీ ముసురు స‌లిలో మంట లాంటి ముచ్చ‌ట అంటూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. మ‌ధ్యాహ్నాం 2.30 గంట‌ల‌కు ఓ అప్‌డేట్‌తో ముందుకు రానున్న‌ట్లు వెల్ల‌డించింది. అన్న‌ట్లుగా చెప్పిన స‌మ‌యానికే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది అంటూ క్యాప్ష‌న్ ఇస్తూ కొత్త పొస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Rajamouli : కల్కిపై రాజమౌళి ట్వీట్.. ఆ ప్రశ్న అడిగిన రాజమౌళి.. కౌంటర్లు వేస్తున్న నెటిజన్లు, సెలబ్రిటీలు..

Bro Trailer : బ్రో ట్రైలర్‌కి టైం ఫిక్స్ అయ్యింది.. గెట్ రెడీ పవన్ ఫ్యాన్స్..!

ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఇంతక‌ ముందే చిత్ర బృందం చెప్పింది. అయితే.. ఏ తేదీన అన్న సంగ‌తి చెప్ప‌లేదు. తాజాగా ఈ విష‌యాన్ని తెలియ‌జేసింది. అక్టోబ‌ర్ 19, 2023న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది. కొత్త పోస్ట‌ర్‌లో బాల‌య్య రెండు చేతుల్లో రెండు గ‌న్స్‌ ప‌ట్టుకుని చాలా గంభీరంగా క‌నిపిస్తున్నాడు.