Bhala Thandhanana : రాక్షసుణ్ణి చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి..

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు, కేథరిన్ నటిస్తున్న ‘భళా తందనాన’ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది..

Bhala Thandhanana : రాక్షసుణ్ణి చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి..

Bhala Thandhanana

Updated On : January 28, 2022 / 11:49 AM IST

Bhala Thandhanana: కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు. నారా రోహిత్ ఫస్ట్ మూవీ ‘బాణం’ తో దర్శకుడిగా పరిచయమైన రైటర్ కమ్ డైరెక్టర్ చైతన్య దంతులూరి ‘బసంతి’ తర్వాత చేస్తున్న సినిమా ‘భళా తందనాన’..

Arjuna Phalguna : ‘ఆహా’ లో ‘అర్జున ఫల్గుణ’.. ఎప్పుడంటే..

కేథరిన్ హీరోయిన్. వారాహి చలన చిత్రం బ్యానర్ మీద రజినీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. గరుడ రామ్, శ్రీనివాస రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, అయ్యప్ప పి.శర్మ, చైతన్య కృష్ణ, పోసాని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Prabhas : బాక్సాఫీస్ ‘బాహుబలి’.. రెమ్యునరేషన్‌తో పాటు థియేట్రికల్ షేర్!

శుక్రవారం ‘భళా తందనాన’ టీజర్ నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు. శ్రీ విష్ణు, కేథరిన్ మీడియా పర్సన్స్‌గా కనిపించారు. ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది. సురేష్ రగుతు విజువల్స్, మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యాయి. క్లుప్తంగా కథ చెప్పే ప్రయత్నం చేశారు టీజర్‌లో.

Ram Pothineni : ‘ఉస్తాద్’ రామ్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?

‘రాక్షసుణ్ణి చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి.. నేను మామూలు మనిషిని’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్‌కి కూడా రిస్కే.. ఈ రోజుల్లో లంచం లేనిదే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు.. సీఎం కుర్చీలో కూర్చుని ఎవరైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్‌నే మార్చెయ్యొచ్చు.. అంటే, ఆ పవర్ చేతిదా? లేక కుర్చీదా?’ వంటి డైలాగ్స్ బాగున్నాయి.