Bharathi Raja : అప్పుడు కొడుకుని తండ్రి డైరెక్ట్ చేశాడు.. ఇప్పుడు తండ్రిని కొడుకు డైరెక్ట్ చేయబోతున్నాడు..

భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా హీరోగా, నటుడిగా పలు సినిమాలు చేశాడు. మనోజ్ ని భారతీరాజానే తాజ్ మహల్ అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశారు. ఇన్నాళ్లు నటుడిగా ఉన్న మనోజ్ ప్రస్తుతం దర్శకుడిగా మారబోతున్నారు.

Bharathi Raja : అప్పుడు కొడుకుని తండ్రి డైరెక్ట్ చేశాడు.. ఇప్పుడు తండ్రిని కొడుకు డైరెక్ట్ చేయబోతున్నాడు..

Bharathi Raja acting in his son manoj bharathiraja directional debut movie

Updated On : May 26, 2023 / 11:51 AM IST

Bharathi Raja -Manoj :  తమిళ్ సీనియర్ డైరెక్టర్, ఒకప్పటి స్టార్ డైరెక్టర్ భారతీరాజా గత కొంతకాలంగా డైరెక్టర్ (Director) గా సినిమాలు చేయకపోయినా నటుడిగా మాత్రం బిజీగా ఉన్నారు. 80 ఏళ్ళ వయసులో కూడా నటుడిగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు భారతీ రాజా. అయితే భారతీరాజా ఇప్పుడు తన కొడుకు దర్శకత్వంలో నటించబోతున్నారు.

భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా హీరోగా, నటుడిగా పలు సినిమాలు చేశాడు. మనోజ్ ని భారతీరాజానే తాజ్ మహల్ అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశారు. ఇన్నాళ్లు నటుడిగా ఉన్న మనోజ్ ప్రస్తుతం దర్శకుడిగా మారబోతున్నారు. మార్గజి తింగళ్ అనే సినిమా ద్వారా మనోజ్ దర్శకుడిగా తమిళ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో దాదాపు అంతా కొత్తవాళ్లే నటిస్తుండగా భారతీరాజా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా తమిళ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.

Harish Shankar : ఆ రిపోర్టర్ పై హరీష్ శంకర్ ఫైర్.. మరోసారి రిపోర్టర్ ని ఆడేసుకుంటున్న నెటిజన్లు..

మనోజ్ భారతీరాజా హీరోగా మొదటి సినిమాకు తన తండ్రి భారతీరాజా దర్శకత్వం వహించారు. ఇప్పుడు మనోజ్ డైరెక్టర్ గా మొదటి సినిమాలో భారతీరాజా లీడ్ రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు తండ్రి కొడుకుని డైరెక్ట్ చేస్తే ఇప్పుడు కొడుకు తండ్రిని డైరెక్ట్ చేయబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై తమిళ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నిన్నే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టనున్నారు.

Image