ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి..

RRR- రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేసింది చిత్ర బృందం..

  • Published By: sekhar ,Published On : March 27, 2020 / 11:20 AM IST
ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి..

Updated On : March 27, 2020 / 11:20 AM IST

RRR- రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేసింది చిత్ర బృందం..

తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పడానికి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ – ‘‘రౌద్రం రణం రుధిరం’’.. కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామ రాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. 

ఉగాది పర్వదినాన విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ‘Bheem For Ramaraju‘ పేరుతో చరణ్ పోషిస్తున్న సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేసింది చిత్ర బృందం..

Bheem For Ramaraju - RRR - Happy Birthday Ram Charan

 

Read Also : చేప పిల్లకి ఈత నేర్పాలా? చరణ్ బర్త్‌డే – చిరు ఎమోషనల్ పోస్ట్..

సీతారామ రాజుగా చరణ్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టర్‌లో ఫైర్.. అల్లూరి పాత్రలో అచ్చుగుద్దినట్టు దిగిపోయాడు. సెంథిల్ కుమార్ విజువల్స్, కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ముఖ్యంగా సీతారామ రాజు పాత్రను పరిచయం చేస్తూ కొమరం భీం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ రొమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.

‘ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’.. అంటూ తారక్ మాడ్యులేషన్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు.  ‘RRR’తో జక్కన్న మరోసారి తెలుగు సినిమా సత్తా ఏంటనేది ప్రపంచ సినీ ప్రేక్షకులకు చూపించబోతున్నాడని గర్వంగా ఫీలవచ్చు.. ఫిక్స్ అవచ్చు..