Bheemla Nayak : నీ మొగుడు ‘గబ్బర్ సింగ్’ అంట..! రానా దగ్గుబాటి డైలాగ్ ప్రోమో
‘భీమ్లా నాయక్’ మూవీలో రానా చేస్తున్న డానియెల్ శేఖర్ ఇంట్రడక్షన్ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది..

Blitz Of Daniel Shekar
Rana Daggubati: మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో ‘భీమ్లా నాయక్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు..
Pawan Kalyan – Anushka : ‘భీమ్లా నాయక్’ సెకండ్ సాంగ్ అంట..!
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పవన్ గ్లింప్స్, టైటిల్ సాంగ్‌కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే.
Rana Daggubati : శృతి, అక్షర మధ్యలో రానా..
సోమవారం ఈ సినిమా నుంచి రానా చేస్తున్న డానియెల్ శేఖర్ క్యారెక్టర్ తాలుకు వీడియో రిలీజ్ చేశారు. ‘‘నీ మొగుడు ‘గబ్బర్ సింగ్’ అంట.. స్టేషన్లో టాక్ నడుస్తుంది.. నేనెవరో తెలుసా.. ధర్మేంద్ర.. హీరో.. హీరో.. డానీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ వన్’’.. అనే డైలాగ్‌తో ఆకట్టుకున్నారు రానా దగ్గుబాటి. ‘భీమ్లా నాయక్’ లో ఆయన నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు.