Bheemla Nayak: భీమ్లా నాయక్.. థియేట్రికల్ రిలీజ్ లేకుండానే దిగుతున్నాడు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.

Bheemla Nayak To Skip Hindi Theatrical Release

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కించగా, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.

Bheemla Nayak: భీమ్లా నాయక్ వచ్చేస్తున్నాడోచ్.. ఇక బాక్సులు బద్దలే!

ఇక ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి కూడా ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించగా, ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా టాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకోగా, ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించింది. అయితే, తాజాగా ఇది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. బాలీవుడ్‌లో భీమ్లా నాయక్ చిత్రాన్ని నేరుగా టెలివిజన్‌లో టెలికాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రముఖ టీవీ ఛానల్ సోనీ మ్యాక్స్‌లో ఈ సినిమాను త్వరలో టెలికాస్ట్ చేయబోతున్నట్లు సదరు ఛానల్ నిర్వాహకులు తెలిపారు.

Bheemla Nayak: నెక్లెస్ రోడ్డులో భీమ్లా నాయక్ హవా!

దీంతో బాలీవుడ్‌లో భీమ్లా నాయక్ చిత్రం థియేట్రికల్ రిలీజ్ లేకుండానే అక్కడి ప్రేక్షకులను బుల్లితెరపై పలకరించేందుకు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాను బుల్లితెరపై ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారా.. ఈ సినిమాకు బాలీవుడ్ జనాలు ఎలాంటి రెస్పాన్స్‌ను ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారంది.