Bheemla Nayak: భీమ్లా నాయక్ వచ్చేస్తున్నాడోచ్.. ఇక బాక్సులు బద్దలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. మలయాళ ఒరిజినల్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు....

Bheemla Nayak: భీమ్లా నాయక్ వచ్చేస్తున్నాడోచ్.. ఇక బాక్సులు బద్దలే!

Bheemla Nayak World Tv Premiere Date Locked

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. మలయాళ ఒరిజినల్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కె. చంద్ర తెరకెక్కించాడు. ఇక మొదట్నుండీ ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడంతో భీమ్లా నాయక్ మేనియాతో ప్రేక్షకులు ఊగిపోయారు. అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ దక్కింది.

Bheemla Nayak: నెక్లెస్ రోడ్డులో భీమ్లా నాయక్ హవా!

ఇక ఓవరాల్‌గా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్.. మరో హీరో రానా దగ్గుబాటి నటన.. థమన్ అందించిన మ్యూజిక్ కలగలిసి ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిపాయి. అయితే ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంలో మార్చి 24న రిలీజ్ చేయగా, అక్కడ కూడా ఈ సినిమా దుమ్ములేపే వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి బాక్సులు బద్దలుకొట్టేందుకు భీమ్లా నాయక్ రెడీ అవుతున్నాడు.

Bheemla Nayak: ఓటీటీలో వచ్చేస్తుంది.. ఇక హిందీ రిలీజ్ లేనట్లేనా?

బుల్లితెరపై భీమ్లా నాయక్ తన పవర్ చూపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా భీమ్లా నాయక్ సినిమాను మే 8న టెలికాస్ట్ చేసేందుకు ప్రముఖ టీవీ ఛానల్ ‘స్టార్ మా’ రెడీ అయ్యింది. ఈ సినిమాకు బుల్లితెరపై కూడా దద్దరిల్లిపోయే రెస్పాన్స్ వస్తుందని.. టీఆర్పీ రేటింగ్స్‌లోనూ సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుందని స్టార్ మా నిర్వాహకులు భావిస్తున్నారు. మరి భీమ్లా నాయక్ చిత్రానికి బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో తెలియాలంటే మే 8 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందించగా, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు.