Bhumika Chawla : కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ప్రమోషన్స్ లో ఎందుకు లేరు.. సంచలన వ్యాఖ్యలు చేసిన భూమిక..
ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భూమిక ప్రస్తుతం అమ్మ, అత్త, అక్క పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఇటీవల భూమిక సినిమాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.

Bhumika Chawla sensational comments on kisi ka bhai kisi ki jaan movie
Bhumika Chawla : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) తాజాగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సల్మాన్, పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్(Venkatesh) పూజాకు అన్నయ్యగా నటించాడు. అంతే కాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఓ సాంగ్ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇక జగపతిబాబు(Jagapathi Babu) విలన్ గా, భూమిక వెంకటేష్ భార్యగా నటించారు. ఇలా చాలా వరకు సౌత్ యాక్టర్స్ నే పెట్టుకొని సౌత్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేసాడు సల్మాన్. కానీ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. సినిమా రిలీజయి ఆరు రోజులు అవుతున్నా ఇంకా 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. బాలీవుడ్ లో తప్ప మిగిలిన చోట్ల అసలు ఈ సినిమా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు కూడా.
ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భూమిక ప్రస్తుతం అమ్మ, అత్త, అక్క పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఇటీవల భూమిక సినిమాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సీనియర్ మహిళా నటీమణులకు ఎందుకు మంచి పాత్రలు ఇవ్వరు అంటూ ఫైర్ అయింది. తాజాగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓ ఇంటర్వ్యూలో మీరు కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనలేదు ఎందుకు అని అడగగా భూమిక మాట్లాడుతూ.. ఈ ప్రశ్నకు సల్మాన్ ప్రొడక్షన్ సంస్థ లేదా సినిమా ప్రమోషన్స్ టీం మాత్రమే సమాధానం చెప్పాలి నన్నెందుకు ప్రమోషన్స్ కి పిలవలేదు అని. నేను ఎవరి వెనకాల తిరగను, ప్రమోషన్స్ కి పిలవమని అడగను. నాకు చాలా పొగరు అనుకుంటారు అని తెలిపింది.
అలాగే కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ సల్మాన్, పూజాహెగ్డే.. మరికొంతమంది బాలీవుడ్ లో టాప్ షో అయినా కపిల్ శర్మ షోకు వెళ్లారు. కానీ దీనికి కూడా భూమికను పిలవలేదు.దీని గురించి ప్రశ్నించగా భూమిక సమాధానమిస్తూ.. అసలు అది ఎప్పుడు షూట్ జరిగిందో కూడా నాకు తెలీదు. వారికి పిలవాలని ఉండాలి. నాకు కొంచెం బాధగా అనిపించింది. అయితే ఈ సినిమాలో నేను వెంకటేష్ గారికి జోడిగా నటించాను. వెంకటేష్ గారు కూడా ఆ షోకి రాలేదు. అందుకే నన్ను కూడా పిలవలేదేమో అనుకున్నాను. అయినా కపిల్ శర్మ షోకి వెళ్లడం వల్ల నాకు ఇంకో సినిమా ఆఫర్ రాదని నాకు తెలుసు. వస్తుంది అంటే నేనే కపిల్ శర్మకు ఫోన్ చేసి వెళ్లేదాన్ని. ఆ షో ద్వారా నాకు ఇంకో సినిమా రానప్పుడు నేను షోకు వెళ్లాల్సిన అత్యవసరం కూడా లేదు కదా అని అన్నారు. దీంతో భూమిక చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.