బిగ్ బాస్ టాప్ – 5 ర్యాంకింగ్స్ వీరికే!

  • Published By: veegamteam ,Published On : November 2, 2019 / 01:06 PM IST
బిగ్ బాస్ టాప్ – 5 ర్యాంకింగ్స్ వీరికే!

Updated On : November 2, 2019 / 1:06 PM IST

బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్స్ చేరటంతో ఎవరు విన్నర్.. విన్నర్ తర్వాత పొజిషన్స్ ఎవరెవరికి దక్కాయి అనేది ఆసక్తిగా మారింది. అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఎవరు విన్నర్ అనేది అధికారికంగా తెలియటానికి మరికొన్ని గంటలు సమయం ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం జరిగిపోతుంది. లిస్ట్ రిలీజ్ అయ్యింది. లీకులు వేలల్లో వస్తున్నాయి. షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, మెగాస్టార్ చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్ తోపాటు కంటెస్టెంట్లకు బహుమతులు, ప్రైజ్ మనీలు అందాయనేది సమాచారం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బిగ్ బాస్ టాప్ 5 లిస్ట్ ఇదే.

ఫస్ట్ ప్లేస్ : రాహుల్ సిప్లిగంజ్
సెకండ్ ప్లేస్ : శ్రీముఖి
థర్డ్ ప్లేస్ : బాబా భాస్కర్
ఫోర్త్ ప్లేస్ : వరుణ్ సందేశ్
ఫిప్త్ ప్లేస్ : అలీ రిజా

మూడు, నాలుగు, ఐదు స్థానాల కోసం పోటీ గట్టిగా జరిగినట్లు తెలుస్తోంది. బాబా భాస్కర్, వరుణ్, అలీ మధ్య గట్టి ఫైట్ నడిచింది. ప్రేక్షకుల ఓటింగ్ కూడా స్వల్పతేడాలోనే ఉందంట. మూడో స్థానానికి వరుణ్ – బాబా భాస్కర్ మధ్య గట్టి పోటీ వచ్చిందట. చివరకు బాబా భాస్కర్ మూడవ ప్లేస్‌లో నిలిచారట. అలీ ఫోర్త్ ప్లేస్ లో అయినా ఉంటాడని చాలా మంది ఊహించారు.అయితే ఐదో స్థానంలోకి వెళ్లటం ఆశ్చర్యం అంటున్నారు నెటిజన్లు.

బాబా భాస్కర్ – వరుణ్ మధ్య కూడా మూడో స్థానం కోసం గట్టిగానే ఫైట్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి 100 రోజులు సాగిన బిగ్ బాస్ సీజన్ 3 ముగిసింది. విన్నర్ ఎవరో చూడా సోషల్ మీడియా చెప్పేసింది. ఇక ఆదివారం సాయంత్రం తెరపై చూడటమే మిగిలింది.