Big Boss 5: తొలి కెప్టెన్ సిరి.. సరయు నోటి నుండి అవే బూతులు!
తన ఇంటికి ఓ కెప్టెన్ కావాలని భావించిన బిగ్ బాస్ ఆట మొదలుపెట్టాడు. సీజన్ 4వ రోజున కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డ బిగ్ బాస్.. పవర్ రూమ్ విజేతలుగా నిలిచిన..

Big Boss 5
Big Boss 5: తన ఇంటికి ఓ కెప్టెన్ కావాలని భావించిన బిగ్ బాస్ ఆట మొదలుపెట్టాడు. సీజన్ 4వ రోజున కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డ బిగ్ బాస్.. పవర్ రూమ్ విజేతలుగా నిలిచిన విశ్వ, మానస్, సిరి, హమీదా కెప్టెన్ అయ్యే అర్హతను పొందారని చెప్పి అందులో ఒకరిని ఫైనల్ చేయడానికి మరో టాస్క్ పెట్టాడు. ఇందుకోసం గార్డెన్ ఏరియాలో నాలుగు సైకిళ్ళను పెట్టి నాన్ స్టాప్ గా తొక్కుతూ లైట్ ఆగకుండా తొక్కినవారే కెప్టెన్ అని ప్రియా నేతృత్వంలో ఈ టాస్క్ జరగాలని ఆదేశించాడు.
ఇక హౌస్ లోని మిగతా కంటెస్టెంట్లకు కూడా ఈ టాస్క్ లో పనిచెప్పాడు. తమకు నచ్చిన వాళ్ళు విన్ అయ్యేలా.. నచ్చని వారు ఓడిపోయేలా కంటెస్టెంట్లు చేయాలని ఆదేశించడంతో ఇంటి సభ్యులు ఎవరికి తోచిన రీతిలో వారు ఈ నలుగురిపై తమ ప్రతాపం చూపించారు. ఈ టాస్క్ లో విశ్వ, మానస్, హమీదా ఓడిపోగా సిరి విజయం సాధించింది. ఆ రకంగా సిరి బిగ్ బాస్ సీజన్ 5 తొలి కెప్టెన్ గా ఎంపికైంది. అయితే, సైకిల్ తొక్కే టాస్క్ లో విశ్వను ఓడిపోయేలా చేసే క్రమంలో కాజల్ చేసిన పని నచ్చని సరయు రెచ్చిపోయింది.
సరయు, కాజల్ మధ్య మాటల యుద్దాన్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసిన ప్రియా.. కాజల్ గేమ్ ప్రకారం ఎవరినైనా డిస్టర్బ్ చేయవచ్చని కాజల్ ను వెనకేసుకొచ్చింది. దీంతో.. సరయు మరికాస్త రెచ్చిపోయింది. కాజల్ సరయుతో మాట్లాడే ప్రయత్నం చేయగా సరయు.. వద్దే నేను నీ పుట్టలో వేలు పెట్టను అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టడంతో అందరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇక చివర్లో కిచెన్ లో అంట్లు తోమే విషయంలో ఉమాదేవి.. లహరి, ప్రియాంకతో గొడవేసుకుంటే.. టాస్క్‌లో భాగంగా షణ్ముఖ్‌కి సేవ చేసిన లోబో తన ఫ్రస్టేషన్‌ను విశ్వ ముందు బయటపెట్టాడు. ఇది నాకు సెట్టయితలేదు. పోయి నా దుకాణంలో ఉంటా అని అసహనానికి లోనైన లోబోని విశ్వ సముదాయించాడు.