వరుణ్, శివజ్యోతిలకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్

బిగ్ బాస్ ఇంటిసభ్యులు నిన్నటివరకు దసరా సంబరాల్లో మునిగి తేలారు. హౌస్‌మేట్స్‌తో దసరా సంబరాలను పంచుకునేందుకు నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందరితో ఆటలు ఆడించి, డ్యాన్స్ లు చేయించారు. వారితో కలిసి నాగార్జున కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే.. బిగ్ బాస్ పాటలు ప్లే చేస్తున్నంతసేపు.. ఇంటిసభ్యులు బాక్స్‌ను ఒకరి నుంచి మరొకరికి మారుస్తూ ఉండాలని, పాట ఆగినప్పుడు బాక్స్ ఎవరి దగ్గర ఉంటుందో వారు దాంట్లోంచి ఓ చీటీ తీయాలని అందులో ఏం రాసి ఉంటే అది చేయాలని తెలిపాడు. అలా చేసిన తర్వాత వారికి గిఫ్ట్ కూడా ఇచ్చాడు.
ఇలా సందడిగా ఆటలు ఆడుకున్న తర్వాత.. ఈ ఇంట్లో తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు స్టార్ ఇవ్వాలని.. ఎవరికి ఎక్కువగా స్టార్స్ వస్తే వారికి ప్రత్యేక బహుమతిని ఇస్తానని తెలిపాడు. దీంతో రెండు స్టార్లతో వరుణ్, శివజ్యోతిలు టాప్‌లో నిలవగా.. వారిద్దరికి ఈ వారం అంతా స్పెషల్ ఫుడ్‌ను తినొచ్చని.. కానీ ఎవరితో షేర్ చేసుకోవద్దని తెలిపాడు. అనంతరం నాగార్జున ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.
ఇక ఇప్పటివరకు చేసిన సందడి అంతా బాగానే ఉంది కానీ ఈ రోజు ప్రోమో చూస్తుంటే.. మామూలుగా లేదు. ఒక్కొక్కరు నువ్వా నేనా అన్నట్టు గొడవలకు దిగుతున్నారు. అసలు ఇంతకు ఈ రోజు ఏమవుతోందా అని అందరిలో టెన్షన్ పెరిగిపోయింది.