Pushpa 2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఆశలు నిరాశలు అయ్యినట్లేనా..!

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఆశలు నిరాశలు అయ్యినట్లే కనిపిస్తుంది. పుష్ప 2 మూవీ..

Pushpa 2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఆశలు నిరాశలు అయ్యినట్లేనా..!

Big competition for Allu Arjun Pushpa 2 at pan India box office

Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్‌ల ‘పుష్ప’ ఎంతటి సంచనలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి భాగం భారీ విజయంతో పాటు సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ క్రేజ్ ని కూడా సెట్ చేసింది. దీంతో సెకండ్ పార్టుతో భారీ కలెక్షన్స్ నమోదు కానున్నాయని.. బన్నీ అభిమానులు లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ లాంగ్ వీకెండ్ అయిన ఆగష్టు 15న అనౌన్స్ చేయడంతో.. ఆ లెక్కలు మరింత పెరిగాయి.

మూవీ పై ఉన్న హైప్ కి ఈ లాంగ్ వీకెండ్ రిలీజ్ తో బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను అందుకోవచ్చని.. బన్నీ అభిమానులు తెగ లెక్కలు వేసేసారు. కానీ ఇప్పుడు వారి అసలు అన్ని నిరాశలుగా మరేటట్లు కనిపిస్తుంది. ఆ లాంగ్ వీకెండ్ లో పుష్ప తో పోటీ పడేందుకు మరికొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. తమిళంలో దళపతి విజయ్ అండ్ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘గోట్’.

Also read : Vikramarkudu 2 : ‘విక్ర‌మార్కుడు 2’ గురించి నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఈ సినిమాని ఆ లాంగ్ వీకెండ్ లోనే తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే తమిళంలో తెరకెక్కుతున్న మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ రజినీకాంత్ ‘వెట్టై’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ కూడా ఆ డేట్స్ లోనే వచ్చేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది. సౌత్ లో పోటీ ఈ రేంజ్ లో ఉంటే.. నార్త్ నుంచి సింగం దాడి చేయబోతుంది. బాలీవుడ్ కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం 3 ఆగష్టు 15కి వచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తుంటే దీపికా పదుకొనే, టైగ‌ర్ ష్రాఫ్, రణ్‌వీర్ సింగ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాతో హిందీ బెల్ట్ లో పుష్ప 2 కు ఓ రేంజిలో పోటీ ఉంటుంది. దీంతో పుష్ప 2 కలెక్షన్స్ కి గండి గట్టిగానే పడబోతోంది అనేది మాత్రం తెలుస్తుంది. మరి ఈ చిత్రాలను అధిగమించి పుష్ప తన మ్యానియాని ఎలా చూపిస్తాడో చూడాలి.