Bigg Boss 5: ఏవీ షూట్ కంప్లీట్.. 26 నుండి కంటెస్టెంట్లకు క్వారంటైన్!
బోర్ డమ్ కి గుడ్ బై అంటూ తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో షోపై చర్చలు..

Bigg Boss 5
Bigg Boss 5: బోర్ డమ్ కి గుడ్ బై అంటూ తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో షోపై చర్చలు కూడా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందమంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా.. వీళ్లలో ఎంతమంది బిగ్ బాస్ హౌస్ గడపతొక్కుతారో ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్భందీగా చర్యలు చేపడుతున్న బిగ్ బాస్ షో నిర్వహకులు.. ఇప్పటికే కంటెస్టెంట్ల ఏవీ షూట్ కూడా పూర్తిచేశారట. మరో రెండు రోజులలో హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు క్వారంటైన్ విధించనున్నారు. ఆగష్టు 26 నుండి సెప్టెంబర్ 3 వరకు కంటెస్టెంట్లను హైదరాబాద్ నగరంలో ఐటీసీకి చెందిన ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటైన్ కి పంపనున్నారట. దీనిని బట్టి చూస్తే సెప్టెంబర్ మొదటి వారం నుండి బిగ్ బాస్ షూటింగ్ మొదలు కానున్నట్లు కనిపిస్తుంది.
ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే యాంకర్ రవి, సరయు సుమన్, మహా న్యూస్ లహరి, అనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ క్వారంటైన్ కి వెళ్లే వారి పేర్లుగా ఇప్పటికే బయటకి వచ్చేయగా సింగర్ కోమలితో పాటు వర్షిణి, రఘు మాస్టర్, నవ్య స్వామి, సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ దుర్గారావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.