Bigg Boss 5 Telugu: కుండ బద్ధలు కొట్టిన కార్తీక దీపం ఫేమ్ ఉమాదేవి
ముందు వారం సరయు.. రెండో వారం ఉమాదేవి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బోల్డ్ గా మాట్లాడే సరయు, బండబూతులు మాట్లాడే ఉమాదేవిని ఫ్యామిలీ ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారట.

Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu: ముందు వారం సరయు.. రెండో వారం ఉమాదేవి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బోల్డ్ గా మాట్లాడే సరయు, బండబూతులు మాట్లాడే ఉమాదేవిని ఫ్యామిలీ ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారట. ఇలా సండే ఎపిసోడ్‌లో వీడ్కోలు తీసుకుంది. ప్రేమగా పొట్టి అని పిలుచుకునే లోబో.. ఉమా ఎలిమినేట్ ప్రకటనను జీర్ణించుకోలేకపోయాడు. ఉబికి వస్తున్న కన్నీటిని దాచుకుని జాగ్రత్తపడ్డాడు.
ఫార్మాలిటీగా స్టేజీ మీదకు వచ్చిన ఉమాతో హోస్ట్ నాగార్జున గేమ్ ఆడించాడు. 17 మంది కంటెస్టెంట్ల ఫొటోలతో ఉన్న కుండలను ఎదురుగా ఉంచి అందులో 8 కుండలను బద్ధలు కొట్టాలని టాస్క్ ఇచ్చాడు. అలా ఆట మొదలెట్టింది ఉమా..
సిరి ఫొటో:
నీకు అనిపించింది చెప్పేస్తావ్ కానీ, ఎదుటివాళ్లు ఎలా తీసుకుంటారు? అనేది పట్టించుకోవంటూ సిరి ఫొటో ఉన్న కుండ పగలగొట్టింది. అంతేకాకుండా షణ్ముఖ్ ఆట సిరి ఆడుతుందని ఆరోపించింది.

Siri Bigg Boss 5
లోబో ఫొటో:
లోబోను హౌస్‌లో ఎంతోమంది కించపరుస్తున్నారంటూ ఎమోషనల్ అయింది. ఎంతోమంది స్వీట్ హార్ట్ అని అంటారు, కానీ లోపలి నుంచి అనరు. ఇకనైనా నీ బుర్రతో గేమ్ ఆడంటూ సలహా ఇచ్చింది.
Read Also: : మహిళలను గెలిపించిన నాగ్
లహరి ఫొటో:
లహరి.. ఈ ప్లాట్‌ఫామ్ మీద చాలా వీక్ అని, పక్కవాళ్లు సపోర్ట్ చేస్తేనే ఆడుతుందే తప్ప సొంతంగా ఆడట్లేదని చెప్పింది.

Lahari Big Boss5
ప్రియ ఫొటో:
సేఫ్‌గా ఆడుతున్నారంటూ ప్రియ ఫొటో ఉన్న కుండ బద్ధలు కొట్టింది. షణ్ముఖ్‌ను నీ గేమ్ నువ్వు ఆడుకోమని సలహా ఇస్తూనే, సిరి కేవలం ఫ్రెండ్ మాత్రమేనని, గేమ్‌పరంగా తనను పక్కన పెట్టమని నొక్కి చెప్పింది.
యానీ మాస్టర్ ఫొటో:
యానీ మాస్టర్‌తో ఎటువంటి గొడవా లేదని, కానీ ఆమెకు కోపం ఎక్కువని పేర్కొంది. ఇక్కడ మనకు ఎవ్వరూ ఏం కాదు! అమ్మ, అక్క, చెల్లి అని మాత్రం చూడకండి అని యానీ మాస్టర్‌కు సూచించింది.

Priya Abigg Boss
యాంకర్ రవి ఫొటో:
ఆ తర్వాత యాంకర్ రవి గురించి చెప్తూ అందరినీ దగ్గరకు తీసుకుంటున్నావు, కానీ ఈ క్రమంలో వేరేవాళ్లకు దూరమైపోతున్నావన్న విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరించింది.
నటరాజ్ మాస్టర్ ఫొటో:
నటరాజ్ మాస్టర్‌ను బాగా ఆడాలని, ఇలాగే ఆడితే వేరే లెవల్‌లో ఉంటారంటూ అతడి కుండ పగలగొట్టింది.