Bigg Boss 7 Day 1 : బిగ్‌బాస్ సీజన్ 7 డే 1.. మొదటి రోజే ప్రేమలు, ఏడుపులు.. నవీన్ పోలిశెట్టి స్పెషల్ అప్పీరెన్స్..

మొదటి రోజు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Bigg Boss 7 Day 1 : బిగ్‌బాస్ సీజన్ 7 డే 1.. మొదటి రోజే ప్రేమలు, ఏడుపులు.. నవీన్ పోలిశెట్టి స్పెషల్ అప్పీరెన్స్..

Bigg Boss 7 Day 1 what happening in House Naveen Polishetty Guest Appearance

Bigg Boss 7 Day 1 : నాగార్జున(Nagarjuna) హోస్ట్ గా బిగ్‌బాస్(Bigg Boss) సీజన్ 7 మొదలైపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి రోజు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) బిగ్‌బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ తో సరదాగా మాట్లాడి, వారితో కాసేపు గడిపాడు. అలాగే హౌజ్ లో అబ్బాయిలు అమ్మాయిల్లో నచ్చిన వాళ్ళకి బ్యాండ్ కట్టాలని టాస్క్ ఇచ్చాడు నవీన్.

దీంతో ఆట సందీప్ ప్రియాంక జైన్ కు, గౌతమ్ కృష్ణ దామినికి, అమర్ దీప్ శోభా శెట్టికి, పల్లవి ప్రశాంత్ రతికకు, శివాజీ శుభశ్రీకి, ప్రిన్స్ యావర్ కిరణ్ రాథోడ్ కు, టేస్టీ తేజ షకీలాకు బ్యాండ్స్ కట్టారు. ఇక మొదటి రోజే ప్రేమలు, ఏడుపులు మొదలయ్యాయి. పల్లవి ప్రశాంత్ హౌజ్ లో రతికతో అప్పుడే పులిహార కలపడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి వెనకే తిరుగుతూ, నీ కోసం ఏదైనా చేసేస్తా అంటూ రతికని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ప్రశాంత్.

మరోవైపు శోభా శెట్టి ఏడుపు మొదలుపెట్టింది. ఒక్క రోజుకే వీక్ అయిపోయానేమో అని బాధపడుతూ.. వీక్ అవ్వకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకుంది. మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. మొదట శివాజీ వచ్చి దామిని, గౌతమ్ కృష్ణ ఫోటోలు చింపి వారిని నామినేట్ చేశాడు. అనంతరం ప్రియాంక జైన్ వచ్చి పల్లవి ప్రశాంత్, రతికని నామినేట్ చేసింది. మిగిలిన నామినేషన్స్ ఇవాళ్టి ఎపిసోడ్ లో ఉండనున్నాయి.

Bigg Boss 7 : బిగ్ బాస్ 7 ఫస్ట్ డే ప్రోమో వచ్చేసింది.. అప్పుడే లవ్ ట్రాక్ షురూ.. ఎవరో తెలుసా..?

ఇక ప్రతి సీజన్ లో చివర్లో డబ్బులు ఆఫర్ చేసి కావాలనుకుంటే తీసుకొని వెళ్లిపోవచ్చు అని అడుగుతారు నాగ్. అయితే ఈ సారి షో మొదట్లోనే కంటెస్టెంట్స్ కి 35 లక్షలు ఆఫర్ చేయగా ఎవరూ తీసుకోలేదు.