Bigg Boss 7 Day 58 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?

ఎనిమిది వారాలు పూర్తిచేసుకోగా తొమ్మిదోవారం కాస్త ఫైర్ గానే సాగాయి నామినేషన్స్. నామినేట్ అయినవాళ్లు ముఖం పై రంగు కొట్టించుకోవాలి. ఈ నామినేషన్స్ లో మొన్న, నిన్న రెండు రోజులు బాగానే గొడవలు అయ్యాయి కంటెస్టెంట్స్ మధ్య.

Bigg Boss 7 Day 58 Highlights Nominations in This Week

Bigg Boss 7 Day 58 : బిగ్‌బాస్ లో సోమవారం నుంచి నామినేషన్స్ మొదలైన సంగతి తెలిసిందే. ఎనిమిది వారాలు పూర్తిచేసుకోగా తొమ్మిదోవారం కాస్త ఫైర్ గానే సాగాయి నామినేషన్స్. నామినేట్ అయినవాళ్లు ముఖం పై రంగు కొట్టించుకోవాలి. ఈ నామినేషన్స్ లో మొన్న, నిన్న రెండు రోజులు బాగానే గొడవలు అయ్యాయి కంటెస్టెంట్స్ మధ్య.

సోమవారం నాడు శివాజీ బ్యాచ్ అంతా అమర్ దీప్ ని టార్గెట్ చేసి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా ప్రశాంత్.. అమర్ దీప్ ని, తేజని నామినేట్ చేశాడు. ప్రియాంక.. రతికని, భోలేని నామినేట్ చేసింది. అర్జున్.. శోభాశెట్టి, అమర్ దీప్ లను నామినేట్ చేశాడు. శివాజీ.. అమర్ దీప్ ని, తేజని నామినేట్ చేశాడు. తేజ.. అర్జున్, రతికలను నామినేట్ చేశాడు. భోలే.. ప్రియాంకను, అమర్ దీప్ ని నామినేట్ చేశాడు.

ఇక యావర్ – అశ్విని మధ్య గొడవ, శోభాశెట్టి – రాతిక, రాతిక – తేజల మధ్య గొడవలు సాగాయి. ఈ గొడవలతోనే ఒకర్నొకరు నామినేట్ చేసుకున్నారు. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లో అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, భోలే, తేజ, యావర్ నామినేషన్స్ లో నిలిచారు. మరి వీరిలో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారో చూడాలి.

Also Read : Bigg Boss 7 Day 57 : కావాలని అమర్ దీప్ ని టార్గెట్ చేస్తున్న శివాజీ బ్యాచ్.. నామినేషన్స్ లో గ్రూపుల గోల..

నామినేషన్స్ అనంతరం బిగ్‌బాస్ ఇంట్లో అబ్బాయిలకు.. అమ్మాయిలను మహారాణులులాగా చూసుకోమని టాస్క్ ఇచ్చారు. దీంతో అబ్బాయిలంతా అమ్మాయిలని బాగా చూసుకున్నారు. టిఫిన్ తినిపించడం, వాళ్ళు అడిగినవి అన్ని తెచ్చి ఇవ్వడం చేశారు. ఇక తేజ అయితే.. శోభాశెట్టికి బ్రష్ కూడా చేయించడం విశేషం. ప్రశాంత్ కూడా రతికతో కలిసిపోయి ఆమెకు టిఫిన్ తినిపించాడు.