Bigg Boss 7 Day 86 : టికెట్ టూ ఫినాలే.. బిగ్‌బాస్ తుదిపోరు మొదలైంది..

టికెట్ టూ ఫినాలే అంటూ టఫ్ టాస్క్ లతో మంగళవారం ఎపిసోడ్ ఏమైంది..?

Bigg Boss 7 Day 86 : టికెట్ టూ ఫినాలే.. బిగ్‌బాస్ తుదిపోరు మొదలైంది..

Bigg Boss 7 Day 86 Highlights Ticket to Finale tasks

Updated On : November 29, 2023 / 7:53 AM IST

Bigg Boss 7 Day 86 : బిగ్‌బాస్ సీజన్ 7 తుది అంకానికి చేరుకుంది. ఫినాలీకి ఇంకా రెండు వారలు మాత్రమే ఉంది. దీంతో బిగ్‌బాస్ గేమ్ మరింత టఫ్ చేశారు. టికెట్ టూ ఫినాలే అంటూ టఫ్ టాస్క్ లతో కంటెస్టెంట్స్ పోరాడేలా చేస్తున్నారు. సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో ముగిసింది. ఇక మంగళవారం ఎపిసోడ్ మొత్తం టికెట్ టు ఫినాలే టాస్క్ లతో సాగిపోయింది. ఈ టాస్క్ ల్లో మొత్తం మూడు గేమ్స్ ని పెట్టారు. మొదటి గేమ్ ‘వీల్ ఛాలెంజ్’, సెకండ్ గేమ్ ‘ఫ్లవర్ ఛాలెంజ్’, థర్డ్ గేమ్ ‘బాల్ టాస్క్’.

వీల్ ఛాలెంజ్ కంటెస్టెంట్స్ అంతా ఒక ప్లాట్‌ఫార్మ్ నిలబడతారా. గడియారం ముళ్ళులా ఒక పొడవాటి రాడ్ తిరుగుతూ ఉంటుంది. అది కాలికి టచ్ అవ్వకుండా, కింద పడకుండా దాని నుంచి తప్పించుకుంటూ ప్లాట్‌ఫార్మ్ నిలబడి ఉండాలి. ఈ ఆటలో అందరూ ఎలిమినేట్ అయ్యిపోగా.. చివరికి అర్జున్ విజేతగా నిలిచారు. తరువాత ఫ్లవర్ టాస్క్‌లో.. కంటెస్టెంట్స్ అంతా పూలను ఒక దగ్గర నుంచి సేకరించి మరో చోట వేయాలి. ఈ టాస్క్ లో శివాజీ, ప్రియాంక తక్కువ పూలను సేకరించి ఎలిమినేట్ అయ్యారు.

Also read : Salaar : సలార్ నుంచి క్రేజ్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. కానీ బ్యాడ్ న్యూస్..

ఇక ఈ రెండు గేమ్స్ కలిపి తక్కువ మార్కులు సంపాదించుకుంది శివాజీ, శోభాశెట్టి. దీంతో వారిద్దరిని టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పుకోమని.. వారి సంపాదించిన మార్కులను మరొకరికి ఇవ్వాలని కోరారు. శివాజీ, శోభా తమ మార్కులను అమర్ కి ఇచ్చేశారు. ఇక లాస్ట్ గేమ్ బాల్ టాస్క్ కి శివాజీ, శోభా సంచాలక్స్ గా వ్యవహరించారు. ఈ బాల్ టాస్క్‌లో.. రింగ్ మధ్యలో ఉన్న బాల్ ని బయటకి లాగి తమ బుట్టలో వేసుకోవాలి. అయితే బాల్ బయటకి వచ్చిన తరువాత ఎవరైనా ఆ బాల్ ని లాకోవచ్చు అని చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. ఈ గేమ్ లో అర్జున్ ఫస్ట్ విజేతగా నిలిచారు. చివరికి అమర్ అండ్ ప్రియాంక మధ్య పోటీ జరగగా.. అమర్, ప్రియాంక నుంచి బాల్ ని లాక్కున్నారు.

ఇలా ఈ మూడు టాస్క్ లతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. కాగా ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో శివాజీ, గౌతమ్, యావర్, ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, శోభా శెట్టి నిలిచారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.