Bigg Boss 9 : సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు.. జీరో దగ్గర మొదలైన కథ.. కానీ..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss 9) ఆఖరి వారానికి చేరుకుంది.
BIGG BOSS 9 telugu december 19 Pawan Kalyan Padala jouryney video
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఆఖరి వారానికి చేరుకుంది. టాప్-5 కంటెస్టెంట్లుగా ఐదుగురు.. కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, సంజనా, తనూజ, ఇమ్మాన్యుయెల్ నిలిచారు. ఆఖరి వారంలో వీరి జర్నీని బిగ్‌బాస్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఇమ్మాన్యుయెల్, తనూజ జర్నీలను చూపించగా నిన్నటి ఎపిసోడ్‌లో (డిసెంబర్ 19)పవన్ కళ్యాణ్ జర్నీని చూపించారు. విన్నర్ రేసులో ఉన్న కళ్యాణ్ పడాల ఎలివేషన్‌ను హీరో రేంజ్‌లో ఇచ్చాడు బిగ్‌బాస్..
బిగ్‌బాస్ ఏమన్నాడంటే..?
కళ్యాణ్.. మీది ఒక సామాన్యుడి కథ.. కానీ సామాన్యమైన కథ కాదు.. జీరో దగ్గర మొదలైన కథ.. కానీ జీరో దగ్గర ముగిసిపోని కథ. కొన్ని కోట్ల మందిలో కొందరికి మాత్రమే కొన్ని కోట్ల మంది ప్రేమని పొందే అవకాశం లభిస్తుంది. దాన్ని మీరు అగ్నిపరీక్షని దాటి సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు వారి ప్రేమని పొంది ఈ స్థానంలో నిలిచి మీ ప్రయాణానికి గొప్ప అర్థన్ని ఇచ్చారు. ఈ ఇంట్లో ఓనర్‌గా మొదలైన మీ ప్రయాణం మొదటిలో సులువుగా అనిపించినా పోనుపోను ఎన్నో కఠినమైన అగ్నిపరీక్షల్ని మీ ముందుకు తీసుకొచ్చింది. వాటిని దాటితే కానీ.. మీ వ్యక్తిత్వాన్ని నిరూపిస్తే కానీ,, ముందుకు కదలలేని పరిస్థితులో మీకు ఒకరి స్నేహం బాసటగా నిలిచింది.
మీ తప్పు ఒప్పులను స్పష్టంగా మీకు తెలిసేలా చేసింది. మీలో ధైర్యాన్ని నింపింది. వారి కోసం ఎలాంటి త్యాగాలనైనా అలవోకగా చేయగలిగే బంధం ఏర్పడింది. మీతో ఈ ప్రయాణం మొదలుపెట్టిన అందరూ ఒక్కొక్కరిగా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లిన క్షణాలు. మిమ్మల్ని కుంగదీసినా తేరుకున్నారు. తప్పుల్ని సరిచేసుకొని.. మీ వ్యూహాల్ని సరైనా సమయంలో అమలు చేశారు.. సరైన దిశలో నడవడమే విజయాన్ని అందించే మార్గమని చూపించారు.
బుద్ధి బలాన్ని, భుజ బలాన్ని మించిన బలం.. గుండె బలం. అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు. గెలవాలనే కసిని ఒక్కోవారం నింపుకుంటూ కెప్టెన్‌గా నిలిచారు. కెప్టెన్సీ మీ ఆటకి మరింత వేగాన్ని జతచేసింది. స్నేహం మీ ప్రయాణానికి ఒక దిశని చూపింది. మీలో ఉన్న యోధుడ్ని నిద్ర లేపింది. ఏకాగ్రత, అమాయకత్వం, పోరాటపటిమ అయిన మీ బలాలను ఎప్పుడూ వీడకుండా లోటుపాట్లన్నీ సరిచేసుకొని చివరి కెప్టెన్‌గా నిలవడమే కాకుండా మొదటి ఫైనలిస్టుగా నిలిచి ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు.
Son Of Teaser : ‘సన్ ఆఫ్'(S/O) టీజర్ రిలీజ్.. తండ్రి మీద కేసు వేసిన కొడుకు..
లక్ష్మణ్ రావ్ లక్ష్మిల కొడుకు కళ్యాణ్ అనే మాట ఇప్పటివరకూ.. కానీ వీళ్లు కళ్యాణ్ తల్లిదండ్రులు అనే గౌరవాన్ని కాలర్ ఎగరేసే గర్వాన్ని ఇప్పుడు వారికి మీరు అందించారు. గొప్ప కలలు కనేందుకు, వాటిని నిజం చేసుకునేందుకు మీలాంటి ఎంతోమంది కామనర్స్‌కి దిక్సూచిగా నిలిచి స్ఫూర్తిని ఇచ్చిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అని బిగ్‌బాస్ కళ్యాణ్ గురించి చెప్పాడు. ఇక కళ్యాణ్ జర్నీ వీడియో మొత్తం హైప్‌లతో నిండిపోయింది. దీంతో బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
