Amardeep – Supritha : అమర్ దీప్ – సుప్రీత జంటగా సినిమా.. టైటిల్ భలే ఉందే..

అమర్ దీప్ చౌదరి - సుప్రీత కలిసి హీరో హీరోయిన్స్ గా సినిమా చేస్తున్నారు.

Amardeep – Supritha : అమర్ దీప్ – సుప్రీత జంటగా సినిమా.. టైటిల్ భలే ఉందే..

Bigg Boss Amardeep Chowdary Surekgavani Daughter Supritha New Movie Title Glimpse Released

Updated On : June 2, 2025 / 9:03 PM IST

Amardeep – Supritha : బిగ్ బాస్, సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న అమర్ దీప్ ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అలాగే సురేఖవాణి కూతురు సుప్రీత ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సుప్రీత ఇపుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

అమర్ దీప్ చౌదరి – సుప్రీత కలిసి హీరో హీరోయిన్స్ గా సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ అనే టైటిల్ ని ప్రకటించారు. దీంతో ఈ టైటిల్ కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాని M3 మీడియా బ్యానర్ పై మహా మూవీస్ తో కలిసి మహేంద్రనాథ్ కొండ్ల నిర్మాణంలో మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే రియల్ లైఫ్ లో కూడా టైటిల్ కి తగ్గట్టు అమర్ దీప్ – సుప్రీత ఇద్దరి క్యాస్ట్ లు అవే కావడంతో టైటిల్ మరింత వైరల్ గా మారింది.

Also Read : Nagarjuna : వామ్మో.. ‘కూలీ’ తెలుగు రైట్స్ భారీ ధరకు.. నాగార్జున రెమ్యునరేషన్ పోగా.. ఇంకా ఎన్ని కోట్లు పెట్టి కొన్నాడంటే..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక ఈ సినిమాలో రోహిత్, రాజా రవీంద్ర, రాసి, వినోద్ కుమార్, ఎస్తర్, రూప లక్ష్మి, గీత సింగ్, మెహబూబ్ బాషా, జబర్దస్త్ సత్యశ్రీ, టేస్టీ తేజ.. ఇలా చాలా మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీరు కూడా చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి టైటిల్ గ్లింప్స్ చూసేయండి..

 

Also Read : Anasuya Bharadwaj : ఫ్యామిలీతో ఛిల్ అవుతున్న అనసూయ.. శ్రీలంక వెకేషన్ ఫొటోలు..