Divi Vadthya : బిగ్‌బాస్ ఫేమ్ దివి లవ్, బ్రేకప్ స్టోరీ తెలుసా? అతను చనిపోవడంతో అంటూ ఎమోషనల్ అయి..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది దివి.

Divi Vadthya : బిగ్‌బాస్ ఫేమ్ దివి లవ్, బ్రేకప్ స్టోరీ తెలుసా? అతను చనిపోవడంతో అంటూ ఎమోషనల్ అయి..

Bigg Boss fame actress Divi Vadtya got emotional after revealing her love and breakup story

Updated On : February 26, 2024 / 8:13 AM IST

Divi Vadthya : పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ బిగ్‌బాస్(Bigg Boss) తో ఫేమ్ తెచ్చుకుంది తెలుగమ్మాయి దివి. ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది దివి.

దివి మాట్లాడుతూ.. నేను బి.టెక్ చదివే రోజుల నుంచి మేము ఇద్దరం ప్రేమించుకున్నాం. చాలా సంవత్సరాలు ప్రేమించుకున్నాం. మా ఇంట్లో కూడా వచ్చి మాట్లాడాడు. మా ఇంట్లో ఒప్పుకున్నారు. మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఓ రోజు అనుకుండా వాళ్ళ తమ్ముడు హెల్త్ ఇష్యూస్ తో చనిపోయాడు. దీంతో అతను ప్రాక్టికల్ గా ఆలోచించాడు. అతను అక్కడే ఊళ్ళో ఉండి పేరెంట్స్ ని చూసుకోవాలి, హైదరాబాద్ రాలేడు, ఒకవేళ నన్ను చేసుకుంటే నేను అక్కడే ఊళ్ళో ఉండాల్సి వస్తుంది, ఇలా ఇన్ని అవకాశాలు రావు నాకు అని నా గురించి కూడా ఆలోచించి విడిపోయాడు. కానీ ఒకవేళ నన్ను అడిగి ఉంటే నేను అతనితో పాటు వాళ్ళ ఊరికి వెళ్లిపోయేదాన్నేమో. తను నా గురించి ఆలోచించే, నేను హ్యాపీగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో హ్యాపీగా ఉన్నాడు అని తెలిపింది.

Also Read : Chiranjeevi : మరోసారి ఇండైరెక్ట్‌గా డైరెక్టర్స్‌కి క్లాస్ పీకిన చిరంజీవి.. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా డైరెక్టర్ గురించి చెప్తూ..

అలాగే.. వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు ఆ 11 రోజులు కార్యక్రమాలకు నేను వాళ్ళింటిదగ్గరే ఉండి అన్ని చూసుకున్నాను, ఇతన్ని జాగ్రత్తగా చూసుకున్నాను, వాళ్ళ తమ్ముడితో, ఫ్యామిలీతో నాకు మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉండేది. అతను అలా చనిపోవడం, ఇలా మేము విడిపోవాల్సి రావడంతో చాలా ఎమోషనల్ అయ్యాను అంటూ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది దివి.