Amardeep : ‘సుమతీ శతకం’ అంటున్న బిగ్ బాస్ అమర్ దీప్.. హీరోగా మరో సినిమా..

అమర్ దీప్ హీరోగా మరో సినిమా ఓపెనింగ్ జరిగింది.

Amardeep : ‘సుమతీ శతకం’ అంటున్న బిగ్ బాస్ అమర్ దీప్.. హీరోగా మరో సినిమా..

Bigg Boss fame Amardeep Chowdary as Hero with another Movie opening on Ugadi

Updated On : March 31, 2025 / 1:59 PM IST

Amardeep : సీరియల్స్, బిగ్ బాస్ తో మెప్పించిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుప్రీత, అమర్ దీప్ ఒక సినిమా చేస్తున్నారు. తాజాగా ఉగాది నాడు అమర్ దీప్ హీరోగా మరో సినిమా ఓపెనింగ్ జరిగింది.

Also Read : Naveen Chandra : నవీన్ చంద్ర కొత్త సినిమా.. కామాక్షి భాస్కర్లతో.. క్రైం థ్రిల్లర్ తో..

అలా నిన్ను చేరి, సన్నీ లియోన్ మందిర సినిమాలను నిర్మించిన విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై మూడో సినిమాగా ‘సుమతీ శతకం’ తెరకెక్కిస్తున్నారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో ఈ సుమతి శతకం నిర్మిస్తున్నారు.

Bigg Boss fame Amardeep Chowdary as Hero with another Movie opening on Ugadi

బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుంది. ఉగాది సందర్భంగా నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.