Naveen Chandra : నవీన్ చంద్ర కొత్త సినిమా.. కామాక్షి భాస్కర్లతో.. క్రైం థ్రిల్లర్ తో..

ఉగాది పండుగ నాడు షో టైమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

Naveen Chandra : నవీన్ చంద్ర కొత్త సినిమా.. కామాక్షి భాస్కర్లతో.. క్రైం థ్రిల్లర్ తో..

Naveen Chandra Kamakshi Bhaskarla New Movie Show Time Announced

Updated On : March 31, 2025 / 1:11 PM IST

Naveen Chandra : నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా ఉగాది నాడు కొత్త సినిమా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ బ్యానర్ పై మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘షో టైమ్’. ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : Vasanthi Krishnan – Keerthi Bhat : ఉగాది నాడు సరదాగా.. బిగ్ బాస్ భామలు వాసంతి కృష్ణన్ – కీర్తి భట్.. ఫొటోలు వైరల్..

నిన్న ఉగాది పండుగ నాడు షో టైమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఓ కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటే వాటి నుంచి ఎలా బయటపడ్డారనే కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే కోణంలో కనిపిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉండనుంది ఈ సినిమా. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది షో టైమ్.

Naveen Chandra Kamakshi Bhaskarla New Movie Show Time Announced

పొలిమేర సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల ఇప్పుడు షో టైమ్, 12A రైల్వే కాలనీ, పొలిమేర 3.. ఇలా వరుస సినిమాలతో బిజీ అవుతుంది. ఇక నవీన్ చంద్ర ఓ పక్క సినిమాలు, మరో పక్క సిరీస్ లతో బిజీగా ఉన్నాడు.