Mehaboob : ‘ఆచార్య’ ఆఫీసు నుండి కాల్ వచ్చింది.. మెహబూబ్..
మెహబూబ్ ‘ఆచార్య’ లో నటిస్తున్నాడని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఆ వార్తలపై స్పందించాడు..

Mehaboob
Mehaboob: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించాలనుకునే ఎంతోమంది ఆర్టిస్టుల ఆశ, కోరిక, డ్రీమ్, డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది.. అలాంటిది ఆయన సినిమాలో వేషం కోసం మెగా బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుండి కాల్ వస్తే ఎలా ఉంటుంది..? ఆ ఆనందం మాటల్లో చెప్పడం సాధ్యం కాదు కదా..!
Chiranjeevi : ఏపీ సీఎం జగన్‌తో భేటీ విషయమై.. మెగాస్టార్ ఆధ్వర్యంలో మీటింగ్..
ఆ లక్కీ పర్సన్ ఎవరో తెలుసా.. బిగ్ బాస్ రియాలిటీ షో తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మెహబూబ్.. బిగ్ బాస్ స్టేజ్ మీద ఏకంగా మెగాస్టార్ మనసు దోచి ఆయన నుండి పది లక్షల రూపాయల చెక్కు కూడా అందుకున్నాడు మెహబూబ్. ఆ వేదిక మీదే మెహబూబ్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానని చెప్పారు చిరు.

ఈ నేపథ్యంలో మెహబూబ్.. చిరు – కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ లో నటిస్తున్నాడని కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఆ వార్తల విషయం గురించి స్పందించాడు మెహబూబ్.. ‘‘ఆచార్య’ టీం నుండి నాకు కాల్ వచ్చింది. వెంటనే ఆఫీసుకి వెళ్లాను. నా రోల్ గురించి కూడా చెప్పారు. కాసేపు మాట్లాడి వచ్చేసాను. తర్వాత మళ్లీ ఫోన్ రాలేదు. ఒకవేళ కాల్ వస్తే మాత్రం వెంటనే వెళ్లి చేసేస్తాను. నేను డబ్బు కోసం కాదు.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను’’.. అని చెప్పాడు. ప్రస్తుతం ‘గుంటూరు మిర్చి’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు మెహబూబ్.
