Priyanka Jain : జుట్టు పెరిగాక పెళ్లి చేసుకుంటాను.. పెళ్లిపై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన బిగ్‌బాస్ భామ..

ఇటీవల బిగ్‌బాస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ కి తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ రావడంతో అందరికి తన ప్రేమ గురించి చెప్పి, నిశ్చితార్థం చేసుకున్నామని చెప్పింది ప్రియాంక జైన్.

Bigg Boss Fame Priyanka Jain gives Clarity about her Marriage with Shiva Kumar

Priyanka Jain : కన్నడ భామ ప్రియాంక జైన్ ఇటీవల బిగ్‌బాస్(Bigg Boss) తో అలరించిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్ 7లో టాప్ 5లో నిలిచింది ఈ భామ. తమిళ్, కన్నడ, తెలుగులో హీరోయిన్ గా కొన్ని చిన్న సినిమాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన ప్రియాంక జైన్ సినిమాల్లో ఆఫర్స్ ఎక్కువగా లేకపోవడంతో టీవీ బాట పట్టింది. టీవీ సీరియల్స్ లో మెయిన్ లీడ్స్ లో చేసి పాపులర్ అయింది. తెలుగులో మౌనరాగం, జానకి కలగనలేదు.. లాంటి పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది ప్రియాంక.

ఇటీవల బిగ్‌బాస్ లో ఫ్యామిలీ ఎపిసోడ్స్ కి తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ రావడంతో అందరికి తన ప్రేమ గురించి చెప్పి, నిశ్చితార్థం చేసుకున్నామని చెప్పింది ప్రియాంక జైన్. అలాగే శివ కుమార్ ని పెళ్లి ఎప్పుడు చేసుకుందాం, నిన్ను మిస్ అవుతున్నాను అని ఎమోషనల్ అయి అడిగింది ప్రియాంక జైన్. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక మొదటిసారి తన యూట్యూబ్ ఛానల్ లో పెళ్లి గురించి వీడియో పోస్ట్ చేసింది.

Also Read : Hitler Teaser : విజయ్ ఆంటోనీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘హిట్లర్’ టీజర్ రిలీజ్..

తన బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ తో కలిసి ప్రియాంక జైన్ ఓ వీడియోని పోస్ట్ చేయగా వీడియోలో.. అందరూ మా పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. వచ్చే సంవత్సరం 2024 లో కచ్చితంగా చేసుకుంటాం. ఎప్పుడు చేసుకుంటాం అనే డీటెయిల్స్ కూడా మేమే చెప్తాము. దయచేసి మమల్ని మళ్ళీ మళ్ళీ పెళ్లి ఎప్పుడు అని అడగకండి అని చెప్పారు. అలాగే ప్రియాంక బిగ్‌బాస్ లో ఓ టాస్క్ లో భాగంగా తన జుట్టు కట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీని గురించి కూడా మాట్లాడుతూ జుట్టు బాగా పెరిగాక పెళ్లి చేసుకుంటాను అని సరదాగా చెప్పింది ప్రియాంక. దీంతో త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Also Read : Salaar : సలార్‌ పాత్రల మధ్య కనెక్షన్ అర్ధం కాలేదా.. ఈ వీడియో చూడండి క్లారిటీ వచ్చేస్తుంది..