Priyanka Singh : మూడు సార్లు చావు నుంచి బయటపడ్డాను.. అమ్మాయిగా మారాలనుకున్న వాళ్ళు.. ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్..
అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ప్రియాంక సింగ్ జబర్దస్త్ లాంటి పలు టీవీ షోలతో పేరు తెచ్చుకుంది. అనంతరం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయింది. తాజాగా యూట్యూబర్ నిఖిల్ కి ప్రియాంక సింగ్ ఇంటర్వ్యూ ఇచ్చింది.

Bigg Boss Fame Priyanka Singh Shares so many Emotional Moments of her life in Interview with Nikhil
Priyanka Singh : అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ప్రియాంక సింగ్ జబర్దస్త్ లాంటి పలు టీవీ షోలతో పేరు తెచ్చుకుంది. అనంతరం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయింది. బిగ్ బాస్(Bigg Boss) తర్వాత టీవీ షోలు, సినిమా ఛాన్సులతో బిజీగానే ఉంది ప్రియాంక సింగ్. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన కష్టాలు చెప్పింది ప్రియాంక. చిన్నప్పట్నుంచి పడ్డ కష్టాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా దూరం పెట్టారని ఎమోషనల్ అయింది. కానీ హౌస్ లోకి వెళ్ళాక వాళ్ళ అమ్మ, నాన్న వచ్చి మళ్ళీ దగ్గరకు తీసుకోవడంతో ప్రియాంక ఎమోషనల్ అయింది.
తాజాగా యూట్యూబర్ నిఖిల్ కి ప్రియాంక సింగ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలని తెలిపింది. ప్రియాంక మాట్లాడుతూ.. తన అసలు పేరు, అమ్మాయిగా మారక ముందు తేజ్ బహదూర్ సింగ్ అని చెప్పింది. ఇలా తమలో ఆ లక్షణాలు ఉండి అమ్మాయిగా మారాలనుకున్న వాళ్ళు కచ్చితంగా హార్మోన్ థెరపీ తీసుకోవాలని, తనకి చిన్నప్పుడే తనలో అబ్బాయి కంటే అమ్మాయి లక్షణాలే ఎక్కువ ఉన్నట్టు అర్థమైందని తెలిపింది.
అలాగే ఇండస్ట్రీలోకి వచ్చాక.. అవకాశాల కోసం ఇలా మారిపోయావా అని చాలామంది అన్నారు. ఒకరిద్దరు నీతో ఉండాలని ఉంది, నైట్ కి ఎంత ఛార్జ్ చేస్తావు అని అడిగారు. ఇండస్ట్రీలో కొంతమంది చిన్నచూపు చూశారు అని తెలిపింది. ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య బూతు ఎక్కువైపోయింది, చాలామంది కామెంట్స్ చేస్తారు, అవి పట్టించుకోకూడదు, ఒకరు లైన్ దాటి మరీ కామెంట్స్ చేశారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే ఓపిక చచ్చిపోతుంది. అందుకే ఇన్‌స్టాగ్రామ్ లో సీరియస్ అయ్యాను అని తెలిపింది.
Also Read : Teja Sajja : ‘హనుమాన్’ సినిమాతో స్టార్ హీరోల సరసన తేజ సజ్జా.. కేవలం 8 మంది మాత్రమే సాధించిన రికార్డ్..
అలాగే.. మొదట్లో ఊళ్ళో వాళ్ళు అనే మాటలే మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. దాంతో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని కాల్చుకున్నాను. మూడు సార్లు చావాలనుకున్నాను, కానీ మూడు సార్లు బతికి బయటపడ్డాను అంటే ఏదో సాధించాలనే అర్థమైంది. అందుకే ఇలా కష్టపడుతున్నాను అని తెలిపింది ప్రియాంక సింగ్. దీంతో ప్రియాంక సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి.