Punarnavi Bhupalam : సైలెంట్ గా ప్రియుడ్ని పెళ్లి చేసేసుకున్న బిగ్ బాస్ భామ.. ఫొటోలు వైరల్..
ఇటీవల డిసెంబర్ లో తను ప్రేమించిన అబ్బాయిని నిశ్చితార్థం చేసుకున్నాను అంటూ ప్రకటించింది పునర్నవి. (Punarnavi Bhupalam)
Punarnavi Bhupalam
Punarnavi Bhupalam : ఉయ్యాల జంపాల సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన పునర్నవి భూపాలం పలు సినిమాల్లో నటించింది. బిగ్బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొని మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే సినిమా అవకాశాలు వచ్చినా వద్దనుకుని లండన్ కి పై చదువుల కోసం వెళ్ళింది.
ఇటీవల డిసెంబర్ లో తను ప్రేమించిన అబ్బాయిని నిశ్చితార్థం చేసుకున్నాను అంటూ ప్రకటించింది పునర్నవి. తాజాగా పునర్నవి పెళ్లి చేసుకుంది. నిన్న రాత్రి మార్చ్ 20న వీరి పెళ్లి జరిగినట్టు సమాచారం.

కేవలం కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల మధ్యే ఈ వివాహం జరిగింది. హేమంత్ వర్మ అనే ఫోటోగ్రాఫర్ ని పునర్నవి పెళ్లి చేసుకుంది. పునర్నవి ఫ్రెండ్స్ పలు ఫొటోలు షేర్ చేసి ఈ పెళ్ళి విషయాన్ని తెలిపారు. దీంతో పునర్నవికి పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram
