Yashmi Gowda : చిన్నప్పటి నుంచి అందరూ ఏడిపించేవాళ్లు.. మా నాన్న రెండేళ్లు నాతో మాట్లాడలేదు..

తాజాగా యష్మి, ప్రేరణ కలిసి ఆహా కాకమ్మ కథలు ఇంటర్వ్యూ షోకి గెస్ట్ గా వచ్చారు.

Yashmi Gowda : చిన్నప్పటి నుంచి అందరూ ఏడిపించేవాళ్లు.. మా నాన్న రెండేళ్లు నాతో మాట్లాడలేదు..

Bigg Boss Fame Yashmi Gowda Tells about her Childhood Sad Story and Father

Updated On : May 18, 2025 / 4:06 PM IST

Yashmi Gowda : నటి యష్మి గౌడ తెలుగు, కన్నడ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొని పాపులర్ అయింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్, పలు షోలతో బిజీగా ఉంది యష్మి. తాజాగా యష్మి, ప్రేరణ కలిసి ఆహా కాకమ్మ కథలు ఇంటర్వ్యూ షోకి గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో యష్మి తన లైఫ్ లోని బాధను తెలిపింది.

యష్మి గౌడ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మా అమ్మ కొంత సపోర్ట్ చేసినా, మా నాన్న అసలు సపోర్ట్ చేయలేదు. కాలేజీ, స్కూల్ లో నన్ను చాలా మంది విమర్శించారు. బాగా ఏడిపించేవాళ్ళు. అప్పట్లో బాగా లావుగా ఉండేదాన్ని. నాకు డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు. ఎలా పడితే అలా డ్రెస్ వేసుకెళ్ళేదాన్ని, హెయిర్ కి ఆయిల్ పెట్టి వరస్ట్ గా వెళ్లేదాన్ని, మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. అందరూ ఏడిపిస్తుంటే అప్పుడు ఏదైనా చేయాలి, మోడల్ అవ్వాలి అనుకున్నా. లావుగా ఉన్నప్పుడే మోడల్ చేశా కానీ అందరూ నవ్వి ఏడిపించారు.

Also Read : Nani – Vijay : ‘నాని అన్న డిన్నర్ కి పిలిచాడు.. మేము ఎక్కువ కలవకపోయినా..’ వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు.. ఫ్యాన్స్ మారాలి..

ఆ తర్వాత యాక్టర్ అవ్వాలి అనుకున్నా. అది చెప్తే మా నాన్న కొట్టేంత పనిచేసారు. నాకు సపోర్ట్ చేయలేదు. రెండేళ్లు మా నాన్న నాతో మాట్లాడలేదు. కానీ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మా నాన్న వచ్చి ఎమోషనల్ అయ్యారు. మా అన్న అక్కడ మాట్లాడటం, జోక్స్ చేయడం నేనెప్పుడూ మా నాన్నను అలా చేయలేదు. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అంటూ ఎమోషనల్ అయింది.