Bigg Boss 8 : తేజ కల నెరవేర్చిన బిగ్ బాస్.. ఆయనతో ప్రేరణ క్యాండిల్ లైట్ డిన్నర్.. ఫ్యామిలీ వీక్ స్పెషల్
బిగ్ బాస్ సీజన్ 8 ఫ్యామి వీక్ చాలా ఎమోషనల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో ముందు నుండి ఉన్న హౌస్ మేట్స్ తో పాటు వైల్డ్ కార్డ్ ల ఇంటి సభ్యులు కూడా వచ్చారు.

Bigg Boss fulfilled Teja dream Prerna candle light dinner with him bigg boss 8 promo
Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఫ్యామి వీక్ చాలా ఎమోషనల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో ముందు నుండి ఉన్న హౌస్ మేట్స్ తో పాటు వైల్డ్ కార్డ్ ల ఇంటి సభ్యులు కూడా వచ్చారు. ఇప్పటికే ఇంట్లోకి అందరి పేరెంట్స్, ఇంటి సభ్యులు రాగా.. టేస్టీ తేజ, ప్రేరణల ఇంటి సభ్యులు మాత్రం రాలేదు. ఇక ఇప్పటికే తేజ రోజూ తన తల్లిని గుర్తుచేసుకుంటూ, మా అమ్మని కూడా పంపండని ఏడుస్తున్నాడు.
Also Read : Aditi Govitrikar : చాన్నాళ్లకు కనిపించిన పవన్ తమ్ముడు మూవీ హీరోయిన్..
అయితే తాజాగా ఈ రోజు విడుదల చేసిన ప్రోమోలో టేస్టీ తేజ, ప్రేరణల ఫామిలీ మెంబెర్స్ ను పంపారు బిగ్ బాస్. ముందు ప్రేరణ భర్త సడన్ గా ఎంట్రీ ఇచ్చి తన భార్య నుదుట సిందూరం పెడతాడు. తర్వాత బిగ్ బాస్ వారికి క్యాండిల్ నైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడు. వారు ఇద్దరూ అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడతారు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్. కచ్చితంగా కప్పు కొట్టుకొని రావాలని ప్రేరణ భర్త అంటాడు. ఇద్దరూ కలిసి కేక్ తినిపించుకుంటారు. అప్పుడు అవినాష్.. అను ని కూడా పంపించండి బిగ్ బాస్ అని అరుస్తాడు.
తర్వాత తేజ తల్లి నుండి హౌస్ లోకి ఫోన్ వస్తుంది. నేను ఇంట్లోకి రాలేకపోతున్నాను. నువ్వు అనుకున్నది చెయ్యలేక పోతున్నా బాధ పడకు నాన్న అని అంటుంది. అది నిజమే అనుకున్న తేజ చాలా ఏడుస్తాడు. అలా కాసేపటి తర్వాత తన తల్లి హౌస్ లోకి వస్తుంది. అనంతరం తల్లీ కొడుకులు చాలా ఏడుస్తారు. నేను ఇంట్లోకి వచ్చేసా ఇంక నువ్వు ఏడవకని తేజ తల్లి అంటుంది. తర్వాత తన తల్లిని కుడికాలు పెట్టి లోపలి తీసుకువెళ్తాడు. నిన్ను ఫినాలేలో కచ్చితంగా చూడాలి.. ఇంకా బాగా గేమ్ ఆడు అని తేజ తల్లి చెప్తుంది. అలా వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమె హౌస్ నుండి బయటికి వచ్చేస్తారు.