Site icon 10TV Telugu

Bigg Boss Nonstop: ఫైనల్‌కు చేరిన బిగ్‌బాస్.. ఈ సీజన్ విన్నర్ ఎవరో?

Bigg Boss Nonstop

Bigg Boss Nonstop

Bigg Boss Nonstop: మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ ముగింపు దశకి వచ్చేసింది. స్టార్‌ మా లో టెలికాస్ట్ అయిన సమయంలో బిగ్‌ బాస్ కు భారీ ఆధరణ దక్కగా.. ఈ నాన్ స్టాప్ ఓటీటీ బిగ్ బాస్ ఆ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదని విమర్శలున్నా.. త్వరలో రెగ్యులర్ బిగ్‌ బాస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ ను ముగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వారంలో ఈ షోకు తెర వేయబోతున్నారు. ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా గత సీజన్ ల కంటెస్టెంట్స్ చివరి వారాలలో వచ్చి సందడి చేశారు.

BiggBoss NonStop : బిగ్‌బాస్‌‌పై మరోసారి ఫైర్ అయిన సిపిఐ నారాయణ

మొత్తం మీద 70 రోజులకు పైగా సాగిన ఈ షో చివరి వారంలో అడుగుపెట్టింది. 17 మందితో మొదలైన ఈ షోలో మధ్యలో ఓ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ కూడా తోడై 18కి చేరుకుంది. వీరిలో శ్రీరాపాక, చైతూ, సరయు, తేజస్వి, ముమైత్‌ ఖాన్‌, స్రవంతి, మహేశ్‌, అజయ్‌, హమీదా, అషూ, నటరాజ్‌ వరసగా ఎలిమినేట్‌ కాగా.. ప్రస్తుతం హౌస్‌లో అరియానా, అనిల్‌, మిత్ర, శివ, బిందు మాధవి, అఖిల్‌, బాబా భాస్కర్‌ ఉన్నారు. ఈ టాప్‌ 7లో ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే అంచనాలు, లెక్కలు సోషల్ మీడియాలో మొదలైపోయాయి.

BiggBoss : షో నచ్చకపోతే ఛానల్ మార్చుకో.. నారాయణపై ఫైర్ అయిన తమన్నా సింహాద్రి..

అయితే, ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లలో ఫైనల్ కు కేవలం ఐదుగురు మించి ఎప్పుడూ లేకపోగా ఈసారి మాత్రం ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనల్స్ కు వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఒకరు వారం మధ్యలోనే హౌస్‌ను వీడే అవకాశం ఉండగా.. మిగిలిన ఆరుగురు ఫినాలేలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. వీరిలో అఖిల్, బిందు మాధవి మధ్య టైటిల్ పోరు జరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది.

Exit mobile version