Urfi Javed: ఈ బిగ్‌బాస్ బ్యూటీ డ్రెస్ చూశారా.. పైత్యానికే పరాకాష్ట!

సెలబ్రిటీల డ్రెస్సుల గురించి అంత విడమర్చి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఫ్యాషన్ పేరుతో రోజు రోజుకీ సైజ్ తగ్గిపోతున్న వాళ్ళ బట్టలు రోజూ ఎక్కడో చోట మనం చూస్తూనే ఉన్నాం.

Urfi Javed: ఈ బిగ్‌బాస్ బ్యూటీ డ్రెస్ చూశారా.. పైత్యానికే పరాకాష్ట!

Urfi Javed (image:instagram)

Updated On : September 4, 2021 / 11:01 AM IST

Urfi Javed: సెలబ్రిటీల డ్రెస్సుల గురించి అంత విడమర్చి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఫ్యాషన్ పేరుతో రోజు రోజుకీ సైజ్ తగ్గిపోతున్న వాళ్ళ బట్టలు రోజూ ఎక్కడో చోట మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే బాలీవుడ్ లో అయితే స్కర్ట్స్ కూడా బాగా కురచగా మారిపోగా.. జిమ్, ఫిట్నెస్ క్లాసుల పేరుతో ముంబై నటీమణులు బట్టల పొదుపు బాగా పెరిగిపోయింది. మరికొందరైతే ఏకంగా కావాలని కత్తిరించుకొని వచ్చారేమో అనేలా డ్రెస్ చేసుకొని పబ్లిక్ లోకి వచ్చేస్తున్నారు.

ఇదిగో మీరు ఫోటోలలో చూశారు కదా ఈ అమ్మడి పేరు ఉర్ఫి జావేద్. విమానాశ్రయంలో కెమెరాలను విపరీతంగా ఆకర్షించిన ఉర్ఫి బ్లూకలర్ డెనిమ్ టాప్ లో థౌసండ్ వాట్స్ నవ్వుతో అందరిని తనవైపు తిప్పుకుంది. అయితే, ఆమె ధరించిన టాప్ మాత్రం లో దుస్తులు కూడా కనిపించేలా కత్తిరించినట్లుగా డిజైన్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఉర్ఫిని ఏకిపారేస్తున్నారు.

ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ షో నుండి ఎలిమినేట్ అయిన ఉర్ఫి ఇలా ఎయిర్ పోర్టులో తళుక్కుమంది. అయితే.. ఆమె టాప్ కున్న చిరుగులు కావాలనే పెట్టారేమో అనేలా చేసిన డిజన్ చూసిన నెటిజన్లు ఇది పైత్యానికి పరాకాష్ట బాబోయ్ అనేస్తున్నారు. ఏమాట కామాట కానీ.. ఉర్ఫి ఇలాంటి డ్రెస్ వేసుకోకపోతే ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకొనేదా చెప్పండి. అందుకే కదా సెలబ్రిటీలు ఇలా ఊరేగేది!

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)