బీ రెడీ.. సెప్టెంబర్ 6న సా.6 గంటలకు బిగ్ బాస్ ప్రారంభం, కంటెస్టెంట్లు వీరేనా

Star Maa’s Bigg Boss 4: రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు బుల్లితెరపై బాగానే పాపులర్ అయ్యింది. గత 3 సీజన్లు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు నాలుగో సీజన్ రెడీ అయ్యింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 సందడి షురూ కానుంది. బిగ్ బాస్ 4 ప్రారంభానికి అంతా రెడీ అయింది. సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ షో ప్రసారం కానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బిగ్ బాస్-4లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితాలో పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
కంటెస్టెంట్లు వీరేనా?
ఈ లిస్ట్ లో యాంకర్లు లాస్య, అరియానా, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, గాయకుడు నోయల్ సేన్, టీవీ-9 దేవి, కొరియోగ్రాఫర్ రఘు, అతని భార్య ప్రణవి(గాయని), గంగవ్వ, నటీమణులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడతోపాటు యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్ సే కంటెస్టంట్లుగా అలరించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఈ జాబితాలో ఉన్న వారిపై బిగ్ బాస్ టీం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మరోసారి హోస్ట్ గా నాగ్:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3ని విజయవంతంగా నిర్వహించిన హీరో అక్కినేని నాగార్జున మరోసారి సీజన్ 4కి హోస్ట్‌గా రానున్నారు. ఈ కార్యక్రమం ప్రీమియర్స్ కు సంబంధించి గురువారం(ఆగస్టు 27,2020) సోషల్ మీడియాలో రిలీజైంది. ఎన్నడూ చూడని ఎంటర్ టైన్ మెంట్, నిజమైన భావోద్వేగాలు అంటూ హోస్ట్ నాగార్జున తాజా ప్రోమోలో తెలిపారు. కాగా, గత సీజన్స్ లాగే ఈ సీజన్‌లో కూడా బిగ్ బాస్ టీమ్.. సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా రంగాల నుండి కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ ను గోప్యంగానే ఉంచింది.
https://10tv.in/virat-kohli-anushka-to-welcome-their-first-child-in-january-2021/
క్వారంటైన్ లో కంటెస్టెంట్స్:
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ప్రస్తుతం కంటెస్టెంట్స్ అందరినీ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా బిగ్ బాస్ నిర్వాహకులు కోరినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జూన్ నెలలోనే మొదలు కావలసిన ఈ షో కరోనా కారణంగా సెప్టెంబర్ కి వాయిదా పడిన విషయం తెలిసిందే.