×
Ad

Sri Satya : ఆల్మోస్ట్ చనిపోయేదాన్ని.. టిప్పర్ లారీ గుద్దేసింది.. శ్రీ సత్య కామెంట్స్ వైరల్..

తాను చావు నుంచి జస్ట్ తప్పించుకున్నాను అని తను ఎదుర్కున్న సంఘటన తెలిపింది. (Sri Satya)

Sri Satya

Sri Satya : మిస్ విజయవాడతో ప్రయాణం మొదలుపెట్టి సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న శ్రీ సత్య బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఇక యూట్యూబ్ లో సిరీస్ లు, సాంగ్స్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టులతో బిజీగానే ఉంది. తాజాగా శ్రీ సత్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.(Sri Satya)

ఈ క్రమంలో తాను చావు నుంచి జస్ట్ తప్పించుకున్నాను అని తను ఎదుర్కున్న సంఘటన తెలిపింది.

Also See : Nirupam Paritala : భార్య, కొడుకుతో కలిసి డాక్టర్ బాబు సంక్రాంతి సెలబ్రేషన్స్.. నిరుపమ్ పరిటాల ఫ్యామిలీ ఫొటోలు..

శ్రీ సత్య మాట్లాడుతూ.. నాకు ఒక యాక్సిడెంట్ అయింది. నేను, మా నాన్న కార్ లో వెళ్తున్నాము. టిప్పర్ లారీ నా కార్ ని గుద్దేసింది. వాడు వెనక్కి తీసుకున్నా కార్ తో పాటు లాగేసింది. వాడు ఆపేసాడు. కరెక్ట్ గా నన్ను తాకి ఆగింది టిప్పర్ లారీ. ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లినా నేను చచ్చిపోయేదాన్ని. ఆల్మోస్ట్ ఆ యాక్సిడెంట్ లో చనిపోయేదాన్ని.

నేను ఎప్పట్నుంచో శివ మాల వేద్దామనుకున్నాను కానీ కుదర్లేదు. ఆ సంఘటన తర్వాతే ఎందుకో అనిపించింది వెంటనే శివ మాల వేసాను. శివ మాల వేసుకున్నాక చాలా బాగుంది. శివ మాల వేసుకున్నాక చాలా ప్రశాంతత వచ్చింది. తర్వాత భైరవ మాల కూడా వేసుకున్నాను అని తెలిపింది.

Also Read : Spirit : ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సమ్మర్లో ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..