Bigg Boss Telugu 10 : సృష్టి వర్సెస్ సుధీర్.. త్రిగుణ్‌కు షాక్.. ఏడ్చేసిన సృష్టి.. బిగ్‌బాస్ 10 డే 17 ఫుల్ ఎపిసోడ్..
నేటి ఎపిసోడ్లో సృష్టి వర్సెస్ సుధీర్ టాస్క్ హైలెట్‌గా నిలిచింది.
Bigg Boss Telugu 10 Day 17 Full Episode trigun Emotional
Bigg Boss Telugu 10 : దేబ్జానికి ఇంటి నుంచి పేరెంట్స్ రాసిన లెటర్ని ముకేశ్ నాశనం చేయడంతో దేబ్జానీ వాష్ రూమ్‌లోకి వెళ్లి ఏడ్చిన సంగతి తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్లో ఆమె బయటకు వచ్చిన తరువాత లెటర్లో ఏముందో చెబుతానని నరేష్, రామ్‌ప్రసాద్ అంటారు. దేబ్జానీ తెలుగులో ఎలా మాట్లాడుతుందో అలా వాళ్ల పేరెంట్స్ రాసినట్లుగా చెబుతూ ఆమెను నవ్విస్తారు.
ఆ తరువాత బిగ్‌బాస్.. ముకేశ్ కు తన తండ్రితో ఉన్న ఫోటోను పంపిస్తాడు. ఆ ఫోటో చూసి ముకేష్ ఆనందంతో పొంగిపోతాడు. అనంతరం బిగ్‌బాస్ కు థ్యాంక్స్ చెప్పాడు. రోహిత్, దేబ్జానీలకు మధ్య పెళ్లి చూపులను ఎపిసోడ్‌ను క్రియేట్ చేస్తారు రామ్‌ప్రసాద్, నరేష్‌లు. అలా కాసేపు ఫన్ క్రియేట్ చేశారు.
వంశీ, త్రిగుణ్ కి వంట చేసేటప్పుడు ఒక రోజంతా ప్లాస్టర్ వేయమని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కెప్టెన్ ఝాన్సీ చెబుతుంది. అయితే ఆమెతో త్రిగుణ్ వాదనకు దిగుతాడు. ప్లాస్టర్‌ను పంపమని బిగ్‌బాస్‌ను ఝాన్సీ కోరగా .. బిగ్‌బాస్ పంపిస్తాడు. ప్లాస్టర్‌ను ఇద్దరికి వేశారు.
Ram Charan : రామ్ చరణ్- సుజీత్ కాంబోపై కొత్త బజ్!
కెప్టెన్సీ కంటెండర్ కోసం టెంప్టేషన్ టాస్క్‌ను మళ్లీ మొదలుపెట్టాడు బిగ్‌బాస్. అల్రెడి నిన్న గెలవడంతో ముకేశ్, ఓడిపోవడంతో దేబ్జానీ ఆడేందుకు అర్హులు కాదని చెబుతాడు. లివింగ్ రూమ్‌లో ముకేశ్, గార్డెన్లో దేబ్జానీలు ఈ టాస్క్‌కు సంచాలకులుగా నియమిస్తారు. బజర్‌లో వర్షిణి, అమన్‌లు గెలుస్తారు.
వర్షిణి, అమన్‌లకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. బజర్ మోగగానే పోటీదారులు పూల్‌లో దూకి అందులో ఉన్న బ్యాగుల్లో ఒకసారి ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఆ తరువాత వాటిని తీసుకువచ్చి ఎవరి కలర్ ప్లేమ్స్లో వాళ్లు ల్యాండ్ అయ్యేలా విసరాలి. ఈ క్రమంలో ఎవరివైనా కిందపడితే వాళ్లవి కూడా తీసుకోవచ్చుని చెబుతాడు. ఈ టాస్క్‌కు ముకేశ్ ను సంచాలక్‌గా నియమించారు. ఈ టాస్క్‌లో అమన్ గెలిచాడు.
అమన్‌కు బిగ్‌బాస్ ఫోన్ చేసి.. ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడారు. కుశల ప్రశ్నలు అడిగారు. మీ అమ్మ మీకు ఎంతో ఇష్టమైన భోజనాన్ని పంపించారు. అది మీకు కావాలంటే వేరే వాళ్లకు టెన్షన్ ఇవ్వాలి. షాలినీకి వాళ్ల అక్క ప్రేమతో రాసిన లెటర్ ఇవ్వకూడదు లేదా రోహిత్ కు అమ్మ, చెల్లి రాసిన ఉత్తరం ఇవ్వకూడదు అని చెప్పాడు. దీంతో అమన్.. రోహిత్‌కు టెన్షన్ ఇస్తానని చెబుతాడు. దీంతో రోహిత్‌కు లెటర్‌ను నాశనం చేయమని చెబుతాడు. దీన్ని చూసిన రోహిత్ కాస్త ఎమోషనల్ అవుతాడు.
సుదీర్ వర్సెస్ సృష్టి..
టెంప్టేషన్ టాస్క్‌లో భాగంగా బజర్‌లో సుధీర్, సృష్టి గెలిచారు. వీరిద్దరికి బిగ్‌బాస్ ఓ టాస్క్ పెట్టాడు. ముందుగా ఓ రోప్‌ను విసిరి ముందున్న మెటల్ బాల్స్‌ను తమ వైపుకు లాక్కోవాలి. ఆ మెటల్ బాల్స్‌తో టైల్స్‌ను పగలగొట్టి ఆ వెనుక ఉన్న ఉడెన్ పీస్‌లను సేకరించి.. వాటిని ఖచ్చితంగా ఉపయోగిస్తూ.. కేటాయించిన ప్లాట్‌ఫామ్ పై రాడ్ పై సూచించిన ఎత్తు ఉండేలా ఇష్టమైన రీతిలో టవర్ నిర్మించాలని చెబుతాడు. దీనికి రోహిత్ సంచాలక్‌గా నియమించాడు.
ఈ టాస్క్‌లో సృష్టి విజేతగా నిలిచింది. సృస్టికి బిగ్‌బాస్ ఫోన్ చేసి.. ఇంట్లో ప్రయాణం ఎలా జరుగుతుందని అడిగాడు. ఇక మీ అమ్మ ప్రేమతో ఉత్తరం రాసింది అది కావాలంటే ఇంటి సభ్యుల్లో ఒకరికి టెన్షన్ ఇవ్వాలి. వంశీకి భార్య రాసిన ఉత్తరం లేదా త్రిగుణ్‌కు భార్య నుంచి వచ్చిన ఉత్తరాన్ని అందకుండా చేయాలి అని చెబుతాడు. దీంతో సృష్టి.. త్రిగుణ్‌కు టెన్షన్ ఇస్తానని చెబుతంది. సృష్టికి త్రిగుణ్ లెటర్ నాశనం చేయమని చెబుతాడు. దీంతో త్రిగుణ్ కాస్త ఎమోషనల్ అవుతాడు.
