Bigg Boss Telugu 7 Day 71 Promo
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో 10 వారాలు పూర్తి అయ్యాయి. 11వ వారం మొదలైంది. సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ప్రొమో విడులైంది. ఎప్పటిలాగానే ఈ దఫా కూడా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. శోభాశెట్టి-రతిక, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్‌ల మధ్య వాడీవేడీ వాదనలు జరిగినట్లు ప్రొమో ద్వారా అర్థమవుతోంది.
నామినేషన్లలో నాన్చకుండా సూటిగా మాట్లాడాలని రతికతో శివాజీ చెప్పాడు. మన టాలెంట్ చూపించాలని, అవతలివారికి మనల్ని ప్రశ్నించే పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నాడు. ఆ తరువాత బిగ్‌బాస్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాడు. నామినేట్ చేసిన ఇంటి సభ్యులపై బాటిల్ పగులకొట్టాలని సూచించాడు. మొదట రతికను పిలిచి తాను నామినేట్ చేయాలనుకునే ఇంటి సభ్యుల పేర్లు చెప్పాలన్నాడు.
Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ అతనితో డేటింగ్‌లో ఉందా..?
కెప్టెన్‌గా శోభాశెట్టి ఫెయిల్ అయ్యిందని చెబుతూ శోభను నామినేట్ చేసింది రతిక. కెప్టెన్ అంటే బ్యాడ్జ్ పెట్టుకోవడం మాత్రమే కాదని అంది. ఈ క్రమంలో ఇరు వురి మధ్య వాదన జరిగింది. అనంతరం ప్రియాంకను నామినేట్ చేసింది. ఎప్పుడైన సొంతంగా ఎవరినైనా నామినేట్ చేశావా అంటూ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేస్తూ అర్జున్ అన్నాడు. గేమ్స్ ఎలా ఆడాలో శివాజీ చెబుతున్నారా..? అంటూ ఫైర్ అయ్యాడు. అటు అంబటి అర్జున్ సైతం శోభాశెట్టిని నామినేట్ చేశాడు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.