Tiger 3: థియేటర్‌లో టపాసులు పేల్చిన అభిమానులు.. భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీసిన ప్రేక్ష‌కులు.. వీడియో వైర‌ల్‌

Salman Khan Tiger 3 : బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన సినిమా టైగ‌ర్ 3. మనీష్ శర్మ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కిన ఈ చిత్రంతో క‌త్రినా కైఫ్ హీరోయిన్‌.

Tiger 3: థియేటర్‌లో టపాసులు పేల్చిన అభిమానులు.. భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీసిన ప్రేక్ష‌కులు.. వీడియో వైర‌ల్‌

firecrackers inside cinema hall

Updated On : November 13, 2023 / 4:28 PM IST

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన సినిమా టైగ‌ర్ 3. మనీష్ శర్మ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కిన ఈ చిత్రంతో క‌త్రినా కైఫ్ హీరోయిన్‌.యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హ‌స్మీ విల‌న్‌గా క‌నిపించారు. ప్రీత‌మ్‌, త‌నూజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

దీపావ‌ళి పండుగ రోజునే స‌ల్మాన్ ఖాన్ సినిమా విడుద‌ల కావ‌డంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది. థియేట‌ర్ల వ‌ద్ద ప్రేక్ష‌కుల కోలాహ‌లం క‌నిపించింది. అయితే.. ఓ థియేట‌ర్‌లో సినిమా స్క్రీనింగ్ అవుతుండ‌గా కొంద‌రు ప‌టాకులు కాల్చారు. ఈ అనూహ్య ఘ‌ట‌న‌తో భ‌యాందోళ‌న‌కు గురైన ప్రేక్ష‌కులు థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని మాలెగావ్‌లోని ఓ థియేట‌ర్లో జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న‌పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు.

Also Read: చేగువేరా బయోపిక్ “చే” మూవీ ట్రైలర్ చూశారా.. పవన్ కళ్యాణ్ ద్వారా తెలిసిన ఈ కథ..

ఈ ప‌ని చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు ఒక నిమిషం పాటు థియేట‌ర్‌లో ట‌పాకుల మోత మోగింది. రాకెట్లు, సీమ‌ట‌పాకాయ‌ల‌ను పేల్చారు. నిప్పు ర‌వ్వులు త‌మ వైపు దూసుకురావ‌డంతో ప్రేక్ష‌కులు భ‌యాందోళ‌న‌కు గురై బ‌య‌ట‌కు ప‌రుగెత్తారు.

Also Read : అర్హతో అల్లు అర్జున్ దివాళీ సెలబ్రేషన్స్ చూశారా..?

స్పందించిన సల్మాన్ ఖాన్
తన సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో బాణాసంచా కాల్చడంపై సల్మాన్ ఖాన్ స్పందించారు. ”ఇలాంటి ప్రమాదకర పనులు చేయొద్దని అభిమానులను కోరారు. టైగర్ 3 సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో థియేటర్‌లో బాణాసంచా కాల్చడం గురించి నేను వింటున్నాను. ఇది ప్రమాదకరం. మనల్ని, ఇతరులను రిస్క్‌లో పెట్టకుండా సినిమాను ఎంజాయ్ చేద్దాం. సురక్షితంగా ఉండండి” అంటూ ఎక్స్ (ట్విటర్)లో పేర్కొన్నారు. కాగా, హిందీతో పాటు తెలుగు, త‌మిళం బాష‌ల్లో విడుద‌లైన టైగ‌ర్ సినిమా మొద‌టి రోజు మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. రూ.44.50 కోట్ల‌ను వ‌సూలు చేసింది.