Bigg Boss Telugu 7 Elimination : మూడో వారంలో ఎలిమినేట్ కానుంది ఎవరో తెలుసా..?
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 7లో మూడో వారం పూర్తి కావొచ్చింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టగా మొదటి వారంలో కిరణ్ రాథోడ్ (Kiran Rathod), రెండో వారంలో షకీలా (Shakeela) లు ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss Telugu 7 3rd Week Elimination
Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు రియాలిటీ షో సీజన్ 7లో మూడో వారం పూర్తి కావొచ్చింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టగా మొదటి వారంలో కిరణ్ రాథోడ్ (Kiran Rathod), రెండో వారంలో షకీలా (Shakeela) లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ వారం నామినేషన్‌లో గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, రతిక, సింగర్ దామిని, అమర్ దీప్, ప్రియాంక జైన్ నామినేషన్‌లో ఉన్నారు.
అయితే.. శనివారం ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్ ను నాగార్జున సేవ్ చేశాడు. దీంతో ఆరుగురు ఎలిమినేషన్‌లో ఉన్నారు. వీరిలో డేంజర్ జోన్‌లో సింగర్ దామిని, శుభ శ్రీలు ఉన్నారని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఈ వారం దామిని ఇంటి నుంచి బయటకు వచ్చిందని టాక్. ప్రిన్స్ యావర్‌తో జరిగిన టాస్క్ కారణంగా ఈ వారం దామినికి కాస్త నెగెటివిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
Atlee : హాలీవుడ్ నుంచి అట్లీకి కాల్ వచ్చిందట.. స్పానిష్‌లో తన నెక్స్ట్ మూవీ..
టాస్క్‌లో ప్రిన్స్ యావర్ ముఖంపై పేడ నీళ్లు, సబ్బు నురగ, ఐస్ క్యూబ్స్ వంటివి పెడుతూ అతడికి చుక్కలు చూపించారు. ఈ క్రమంలో దామినికి తక్కువ ఓట్లు పడ్డాయని, దీంతో హౌజ్ నుంచి ఆమె బయటకు వచ్చిందని అంటున్నారు. మరీ నిజంగానే దామిని ఎలిమినేట్ అయ్యిందా లేదో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.