Bigg Boss 8 : బిగ్‌బాస్ హౌస్‌లో గుడ్ల కోసం కొట్లాట.. ఆదిత్యను ఎత్తి ప‌డేసిన‌ పృథ్వి.. టాస్క్ వద్దని చెప్పండన్న యష్మి..

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 8లో మూడో వారం కొన‌సాగుతోంది.

Bigg Boss Telugu 8 Day 17 Promo 2 fight between prithviraj and aditya

Bigg Boss Promo : తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 8లో మూడో వారం కొన‌సాగుతోంది. కంటెస్టెంట్స్ రెండు టీమ్స్‌గా టాస్కులు ఆడుతున్నారు. కొన్ని టాస్కులు హోరాహోరీగా సాగుతున్నాయి. తాజాగా నేటి ఎపిసోడ్ (సెప్టెంబ‌ర్ 18) సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు. బిగ్‌బాస్ ‘బంగారు కోడి పెట్ట’ అనే టాస్క్‌ను పెట్టాడు.

ఇక రెండు క్లాన్స్ ల‌లో ఎవ‌రు ఎక్కువ గుడ్ల‌ను తిరిగి ఇస్తారో వారికి నా త‌రుపున కొన్ని ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని కోడి అంది. గుడ్ల కోసం కంటెస్టెంట్లు కిందామీదా పడ్డారు. ఈ క్ర‌మంలో గొడ‌వ‌లు జ‌రిగాయి. పృథ్వీ దూకుడు ప్ర‌ద‌ర్శించాడు. ఆదిత్య ఓం, సోనియా, నబీల్ లు గుడ్ల కోసం ప్ర‌య‌త్నిస్తుంటే.. పృథ్వీ వ‌చ్చి ఆదిత్య‌ను ప‌క్క‌కు నెట్టేశాడు. దీనిపై ఆదిత్య అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. పృథ్వీకి సోనియా, విష్ణు కూడా స‌పోర్టు చేశారు.

Pailam Pilaga Trailer : బాల‌య్య‌కు న‌చ్చిన ‘పైలం పిలగా’ ట్రైల‌ర్ చూశారా?

దెబ్బ‌లు త‌గులుతున్నాయ‌ని కొంద‌రు అంటున్నారు. తాను అమ్మాయినైనా ఆడుతున్నాను అంటూ య‌ష్మి గ‌ట్టిగా అరిచింది. దెబ్బ‌లు త‌గులుతున్నాయి.. అక్క‌డ త‌గులుతుంది.. ఇక్క‌డ త‌గులుతుంది అంటే అస‌లు టాస్కే పెట్టవ‌ద్ద‌ని బిగ్‌బాస్‌కు చెప్పండ‌ని మండిప‌డింది. గుడ్ల కోసం కంటెస్టంట్లు గ‌ట్టిగానే క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లుగా ప్రొమోను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. మ‌రి శ‌క్తి, కాంతార టీమ్‌ల‌లో ఎవ‌రు గెలుస్తారో చూడాలి మ‌రి.