Bigg Boss 8 : బిగ్‌బాస్ హౌస్‌లో దీపావళి సెలబ్రేషన్స్.. క్యూ కట్టిన సెలబ్రిటీలు.. ఎవరెవరు వచ్చారో తెలుసా ?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది.

Bigg Boss Telugu 8 Day 56 Promo 1 Diwali Dhamaka in Bigg Boss House
Bigg Boss 8 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఎనిమిదో వారం ఆఖరికి వచ్చేసింది. ఇక నేడు (ఆదివారం) ఎవరు ఎలిమినేట్ కానున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. బిగ్‌బాస్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. పలువురు స్టార్ సెలబ్రిటీలు, స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు, సరదా ఆటలు ఉండనున్నట్లుగా అర్థమవుతోంది.
మొదటగా అమరన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ సాయిపల్లవిలు వచ్చారు. యాంకర్ అనసూయ కూడా వచ్చింది. ఇక లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి సైతం వచ్చారు.
Samyuktha : బాలకృష్ణ హాస్పిటల్లో హీరోయిన్ సంయుక్త.. క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో..
ఇక క సినిమా ప్రమోషన్ కోసం హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్లు తన్విరామ్, నయన్ సారికలు వచ్చారు. కాగా.. ఈ మూడు సినిమాలు దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అవినాశ్ పై నాగ్ పంచులు వేశాడు. కళ్లకు గంతలు కట్టుకొని కుక్కకు తోక గీసే టాస్కును కంటెస్టెంట్లకు నాగార్జున ఇచ్చారు. ఆ తరువాత హైపర్ ఆది వచ్చి ఎవరు ఎలా ఆడారో చెప్పాడు.
Allu Arjun : డేవిడ్ వార్నర్‌కు అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్.. ఆ పదం వాడేసి..
ఇదిలా ఉంటే.. దీపావళి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ కావడంతో సాయంత్రం 7 గంటల నుంచే నేడు బిగ్‌బాస్ ప్రసారం కానుంది. ఇక ఈ వారం మెహబూబ్ ఎలిమినేట్ కానున్నాడని టాక్.