Bigg Boss 8 telugu : శ‌నివారం తేజ‌, ఆదివారం పృథ్వీ.. బిగ్‌బాస్ సీజ‌న్ 8 విన్న‌ర్‌కు ప్రైజ్‌మ‌నీతో పాటు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌..

బిగ్‌బాస్ సీజ‌న్ 8 ఆఖరి అంకానికి వ‌చ్చేసింది.

Bigg Boss Telugu 8 Elimination Week 13 Prithvi Gets Evicted

బిగ్‌బాస్ సీజ‌న్ 8 ఆఖరి అంకానికి వ‌చ్చేసింది. ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ జ‌రిగింది. శ‌నివారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆదివారం పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. ప్ర‌స్తుతం హౌస్‌లో ఏడుగురు అవినాష్‌, రోహిణి, గౌత‌మ్‌, నిఖిల్‌, ప్రేర‌ణ‌, విష్ణు ప్రియ, నబిల్‌లు మాత్ర‌మే ఉన్నారు.

ఆదివారం నాటి ఎపిసోడ్‌లో పృథ్వీ, విష్ణు ప్రియ‌లు ఆఖ‌రి వ‌ర‌కూ డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. వీరిద్ద‌రిలో ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారు అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు. చివ‌రికి ఫృథ్వీకి త‌క్కువ సంఖ్య‌లో ఓట్లు రావ‌డంతో ఎలిమినేట్ అయ్యాడ‌ని వ్యాఖ్యాత‌ నాగార్జున ప్ర‌క‌టించారు.

Varun Tej : మట్కా రిజల్ట్.. రూటు మార్చిన వరుణ్ తేజ్.. నెక్స్ట్ సినిమా ఎప్పుడంటే..

తాను ఎలిమినేట్ అయినందుకు ఎలాంటి బాధ లేద‌ని స్టేజీ పైకి వ‌చ్చిన త‌రువాత పృథ్వీ చెప్పాడు. నిఖిల్‌, నబీల్‌, విష్ణు ప్రియలు సూపర్‌ హిట్ అని, రోహిణి, అవినాష్‌లు సూప‌ర్ ప్లాఫ్ అని అన్నాడు.

ఆ త‌రువాత నాగార్జున మాట్లాడుతూ.. ఈ సీజ‌న్ విన్న‌ర్‌కు ప్రైజ్‌మ‌నీ, ట్రోఫీతో పాటు మారుతి సుజుకీ ఆల్ న్యూ డ్యాజిలింగ్ డిజైర్ కారును కూడా సొంతం చేసుకుంటార‌ని ప్ర‌క‌టించారు. ఇక గోల్డెన్ టికెట్ వ‌చ్చిన ముగ్గురు కంటెస్టెంట్‌ల‌కు స్పెష‌ల్ ఆఫ‌ర్ ఉంటుంద‌ని చెప్పాడు.

Vikrant Massey : కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో..

అనంత‌రం ఇప్ప‌టికే గ్రాండ్ ఫినాలే చేరుకున్న అవినాష్ మిన‌హా మిగిలిన అంద‌రూ నామినేష‌న్స్‌లో ఉంటార‌ని బిగ్‌బాస్ ప్ర‌క‌టించారు.