Varun Tej : మట్కా రిజల్ట్.. రూటు మార్చిన వరుణ్ తేజ్.. నెక్స్ట్ సినిమా ఎప్పుడంటే..

మెగా హీరో వరుణ్ తేజ్ గురించి తెలిసిందే. ఇటీవల మట్కా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో.

Varun Tej : మట్కా రిజల్ట్.. రూటు మార్చిన వరుణ్ తేజ్.. నెక్స్ట్ సినిమా ఎప్పుడంటే..

Matka movie result Varun Tej next movie update

Updated On : December 3, 2024 / 3:32 PM IST

Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ గురించి తెలిసిందే. ఇటీవల మట్కా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు ఆయన. కానీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇప్పటికే వరుస ప్లాప్స్ తో వరుణ్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు

ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ సినిమాను మంచి డైరెక్టర్ తో చెయ్యడానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది. మట్కా డిజాస్టర్ తర్వాత తన తదుపరి సినిమాను వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీతో చెయ్యాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు ఈ డైరెక్టర్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read : Unstoppable With NBK : అన్‌స్టాప‌బుల్ నుండి శ్రీలీల,న‌వీన్ పొలిశెట్టి ఎపిసోడ్ గ్లింప్స్ రిలీజ్..

అయితే మట్కా రిజల్ట్ తో రూటు మార్చాడు వరుణ్ తేజ్. సీరియస్ యాక్షన్ సినిమాలు కాకుండా కామెడీ నేపథ్యంలో సినిమాలు చెయ్యాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు చేస్తున్న సినిమా హార్రర్ కామెడీ నేపథ్యంలో రానుందట. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను 2025 మార్చ్ లో స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉన్నాయి.