Adi Reddy : అయోధ్య రామ మందిరానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ విరాళం

అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళం అందించి రామ భక్తిని చాటుకున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో వచ్చిన కంటెస్టెంట్ లక్ష రూపాయలు విరాళం అందించారు. ఎవరా కంటెస్టెంట్?

Adi Reddy : అయోధ్య రామ మందిరానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ విరాళం

Adi Reddy

Updated On : January 11, 2024 / 2:55 PM IST

Adi Reddy : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చూసిన వారికి ఆదిరెడ్డి బాగా తెలుసు. యూట్యూబర్‌గా మంచి పేరు సంపాదించుకున్న ఆదిరెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి తనవంతు విరాళం అందించారు ఆదిరెడ్డి.

Miss Perfect Teaser : పెళ్లి తరువాత లావణ్య నుంచి వస్తున్న మొదటి వెబ్ సిరీస్.. టీజర్ చూశారా..?

నెల్లూరికి చెందిన ఆదిరెడ్డి ఎలక్ట్రికల్ ఇంజనీర్.. ఆ తర్వాత యూట్యూబర్‌గా మారారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు యూట్యూబ్‌లో రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేసి బాగా పాపులర్ అయ్యారు. సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నారు. ఆ పాపులారిటీతోనే బిగ్ బాస్ 6 లో ఎంట్రీ ఇచ్చి హౌస్‌లో తన ఆటతో ఆకట్టుకున్నారు. ఆదిరెడ్డి అయోధ్య రామ మందిరానికి తనవంతు లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.

#90’s Review : 90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు వివరాళం అందిస్తున్నారు. ఈ నెల 22న ఈ ఆలయన ప్రారంభోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ మహత్కార్యంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపు ఇచ్చింది. లక్షలాదిమంది భక్తులు విరాళం అందిస్తున్నారు. ఆదిరెడ్డి సైతం లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. రాముడి మందిరానికి తనవంతుగా లక్ష రూపాయలు డొనేట్ చేసానని.. రామ మందిర నిర్మాణం మనందరి కల అని చెబుతూ మనమంతా చేయూతగా విరాళం అందించాలని పిలుపునిచ్చారు. ఆదిరెడ్డి ప్రస్తుతం యూట్యూబర్‌గా కొనసాగుతూ విజయవాడలో జావెద్ హబిబ్ పేరుతో సెలూన్ వ్యాపారం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Adi Reddy (@adireddyofficial)