Bigg Boss Telugu Season 8 : ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ 14 మంది వీళ్ళే.. ఫుల్ లిస్ట్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే..
Bigg Boss Telugu Season 8 Contestants Full List : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ గా మొదలైంది. గత కొన్ని రోజులుగా కంటెస్టెంట్స్ ఎవరెవరు వెళ్తారా అని అంతా ఎదురుచూసారు. నేడు సాయంత్రం 7 గంటలకు స్టార్ మా ఛానల్ లో నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైంది. ఇక కంటెస్టెంట్స్ అందరూ తమ స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.
Also Read : Bigg Boss 8 – Nainika : బిగ్ బాస్ సీజన్ 8.. పదమూడో కంటెస్టెంట్.. డ్యాన్సర్ నైనిక గురించి తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే..
మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటి యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చింది.
రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ మలియక్కల్ వచ్చాడు.
మూడో కంటెస్టెంట్ గా నటుడు, డైరెక్టర్ అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చాడు.
నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ నటి ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది.
ఐదో కంటెస్టెంట్ గా ఒకప్పటి హీరో ఆదిత్య ఓం వచ్చాడు.
ఆరో కంటెస్టెంట్ గా సీరియల్ నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది.
ఏడో కంటెస్టెంట్ గా బెజవాడ బేబక్క అలియాస్ సింగర్ మధూ ఎంట్రీ ఇచ్చింది.
ఎనిమిదో కంటెస్టెంట్ గా రాజ్ తరుణ్ ఫ్రెండ్ ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు.
తొమ్మిదో కంటెస్టెంట్ గా బేబీ ఫేమ్ నటి కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చిది.
పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ హౌస్ లోకి వచ్చాడు.
పదకొండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు పృథ్వీరాజ్ శెట్టి హౌస్ లోకి వచ్చాడు.
పన్నెండో కంటెస్టెంట్ గా యాంకర్ విష్ణుప్రియ హౌస్ లోకి వచ్చింది.
పదమూడో కంటెస్టెంట్ గా డ్యాన్సర్ నైనిక ఎంట్రీ ఇచ్చింది.
పద్నాలుగో కంటెస్టెంట్ గా వరంగల్ యూట్యూబర్ నబిల్ ఆఫ్రిది ఎంట్రీ ఇచ్చాడు.
మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ రాగా అందులో ఏడుగురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు.