Donald Trump : ట్రంప్‌కి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన మచాడో.. ఇలా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చా? రూల్స్‌లో ఏం ఉంది?
Donald Trump : తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతిని . వెనెజువెలా విపక్ష నేత మారియా కోరీనా మచాడో డొనాల్డ్ ట్రంప్‌నకు బహుకరించింది. అయితే, నార్వే నోబెల్ కమిటీ రూల్స్ ప్రకారం.. ఒకరికి వచ్చిన పురస్కారాన్ని మరొకరికి బదిలీ చేయడం, వేరొకరితో పంచుకోవడం చెల్లదు.
Donald Trump
- ట్రంప్‌తో మారియా కోరీనా మచాడో భేటీ
- నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌నకు అందజేసిన మచాడో
- నోబెల్ కమిటీ రూల్స్ ఇవే..
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల ఎట్టకేలకు నెరవేరింది. నోబెల్ శాంతి బహుమతి ఆయన చేతికందింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ నోబెల్ శాంతి బహుమతి నోబెల్ కమిటీ ఇచ్చిన అవార్డు కాదు.. వెనెజువెలా విపక్ష నేత మారియా కోరీనా మచాడో ట్రంప్‌నకు దీన్ని అందజేశారు.
Also Read : Jupally Krishna Rao : గోల్కొండలో ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’.. గగనతలంలో మంత్రి జూపల్లి సాహస యాత్ర..
ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి -2025 కి మరియా కొరీనా మచాడో ఎంపికైన విషయం తెలిసిందే. నార్వే నోబెల్ కమిటీ వెనెజువెలాకు చెందిన మచాడోకు ఈ బహుమతిని అందజేసింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం ఆమెకు లభించింది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం మొత్తం 338 మంది నామినేట్ అయ్యారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. చివరి వరకు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి తనకే దక్కుతుందని భావించాడు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ, అకాడమీ సభ్యులు మరియా కొరీనా మచాడోను 2025 నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసింది. అయితే, తాజాగా.. ఆ బహుమతిని మచాడో డొనాల్డ్ ట్రంప్ నకు అందజేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వెనెజువెలా విపక్ష నేత, 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కోరీనా మచాడో భేటీ అయ్యారు. గురువారం వైట్‌హౌస్‌లో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను ఆమె ట్రంప్‌నకు అందజేశారు. వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అక్కడ గుమిగూడిన మద్దతుదారులతో మచాడో స్పానిష్ లో మాట్లాడారు.. మనం అధ్యక్షుడు ట్రంప్ పై భరోసా పెట్టుకోవచ్చు అన్నారు. మన స్వేచ్ఛ పట్ల ఆయనకున్న ప్రత్యేక నిబద్దతకు గుర్తింపుగా నేను అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని బహుకరించాను అని మచాడో ఇంగ్లీషులో విలేకరులతో చెప్పారు.
వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో అందజేసిన నోబెల్ శాంతి పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మచాడోకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ చర్యను పరస్పర గౌరవానికి అద్భుత సంకేతంగా అభివర్ణించారు.
నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం..
నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం.. ఒకరికి వచ్చిన పురస్కారాన్ని మరొకరికి బదిలీ చేయడం, వేరొకరితో పంచుకోవడం చెల్లదు. ఈ విషాయన్ని నార్వేజియన్ నోబెల్ ఇన్ స్టిట్యూట్‌స్పష్టం చేసింది. ‘‘నోబెల్ పురస్కారాన్ని రద్దు చేయలేరు, పంచుకోలేరు లేదా మరొకరికి బదిలీ చేయలేరు. ఒకసారి ప్రకటన చేయబడిన తర్వాత ఆ నిర్ణయం శాశ్వతంగా నిలుస్తుంది.’’ అని నోబెల్ కమిటీ నిబంధనల్లో స్పష్టం చేసింది. అయితే, బహుమతిని వేరొకరికి ఇవ్వొచ్చునని, కానీ, దానిపై విజేత పేరు శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతుందని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం మరియా కొరీనా మచాడో ట్రంప్ నకు నోబెల్ బహుమతి ఇచ్చినప్పటికీ అది కేవలం మర్యాదపూర్వకంగానే ఇచ్చినట్లు అవుతుంది. దానికి ఏమాత్రం అర్హత ఉండదు. ఆ బహుమతి శాశ్వతంగా మరియా కొరీనా మచాడో పేరుపైనే ఉంటుంది.
