Bigg Boss 5 : ఒకపక్క సరదా ఆటలు.. ఒకపక్క గొడవలు..

కెప్టెన్సీ టాస్క్ ల వల్ల అందరూ గొడవ పడ్డారు. కెప్టెన్ సెలక్షన్ అయిపోయాక ఇప్పుడు మరి కొన్ని కొత్త కొత్త టాస్కులు ఇచ్చారు. వాటిల్లో సరదాగా ఆడేవి ఉన్నాయి. గొడవ పడేవి ఉన్నాయి.

Bigg Boss 5 : ఒకపక్క సరదా ఆటలు.. ఒకపక్క గొడవలు..

Bb5

Updated On : October 15, 2021 / 6:36 PM IST

Bigg Boss 5 :  ఈ సారి బిగ్ బాస్ ఎక్కువగా గొడవలతోనే సాగుతుంది. రోజు రోజుకి ఈ గొడవల వల్ల బిగ్ బాస్ ఆసక్తికరంగా మారుతుంది. మొన్నటి దాకా కెప్టెన్సీ టాస్క్ ల వల్ల అందరూ గొడవ పడ్డారు. కెప్టెన్ సెలక్షన్ అయిపోయాక ఇప్పుడు మరి కొన్ని కొత్త కొత్త టాస్కులు ఇచ్చారు. వాటిల్లో సరదాగా ఆడేవి ఉన్నాయి. గొడవ పడేవి ఉన్నాయి.

ఇవాళ నైట్ రాబోయే ఎపిసోడ్ లో హౌస్ లో ఎవరు వరస్ట్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో హౌస్ లో ఉన్న వాళ్లంతా వాళ్ళకి వరస్ట్ అనిపించిన వాళ్ళ షర్ట్ మీద వరస్ట్ స్టాంప్ వేయాలి. ఈ క్రమంలో అందరి మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. ఆ తర్వాత అందర్నీ హ్యాపీగా ఉంచడానికి సరదా గేమ్స్ పెట్టారు. కుండల్ని పగల కొట్టడం, ముక్కుతో దూది తీసుకురావడం, స్ట్రాతో థర్మాకోల్ బాల్స్ తీసుకురావడం ఇలా చాలా ఫన్నీ గేమ్స్ పెట్టాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ అంతా హ్యాపీగా ఆడారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో అందరి కంటే వరస్ట్ ఎవరు??
ఇక వంట విషయంలో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. లోబో విశ్వాని ఛాయ్ ఇంకా కాలేదా కష్టపడి నిన్ను కెప్టెన్ చేస్తే ఏందీ ఇది? అని అనడంతో విశ్వా రెండు నిమిషాల్లో తెస్తాను సర్.. నువ్వేం కష్టపడినవ్ నన్ను కెప్టెన్ చేయానికి అన్నాడు. ప్రియా వచ్చి హాట్ వాటర్ ఎవరు పెట్టారు అని అడిగింది. శ్వేతా అని వేరే కంటెస్టెంట్స్ చెప్పడంతో రైస్ అవుతుంటే తీసేసి ఎలా పెడతావు అని సీరియస్ అయింది. శ్వేత సీరియస్ అయి వచ్చి తీసేస్తుంటే ప్రియా అందరు రెస్పాన్సిబుల్ గా ఉండాలి అంటే ఇక్కడ అందరు రెస్పాన్సిబుల్ గానే ఉన్నారు అని శ్వేత సీరియస్ అయింది. ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు అని శ్వేత అంటే ప్రియా సెటైర్ గా నీకు ఏదీ నచ్చదు అని అంది. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి అంటే ఇవాళ నైట్ ఎపిసోడ్ చూడాలి.