Delhi : రేవ్ పార్టీలో పాము విషం సర్వ్ చేసిన బిగ్ బాస్ విన్నర్..

ఆ బిగ్ బాస్ OTT విజేత పాములతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారట. రేవ్ పార్టీల్లో పాము విషం సరఫరా చేస్తారట.. పోలీసులు కేసు నమోదు చేసిన ఆరుగురిలో అతని పేరు కూడా ఉంది. ఎవరంటే?

Delhi : రేవ్ పార్టీలో పాము విషం సర్వ్ చేసిన బిగ్ బాస్ విన్నర్..

Delhi

Delhi : బిగ్ బాస్ OTT విన్నర్ ఎల్విష్ యాదవ్ రేవ్ పార్టీల్లో పాము విషం సరఫరా చేస్తున్నారనే వార్త సంచలనంగా మారింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు తీయడం కోసం పాములు ఉపయోగించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.

Big Boss 7 : బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి గుండెపోటు.. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్..

రేవ్ పార్టీలకు పాములు, వాటి విషాన్ని సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వారిలో బిగ్ బాస్ OTT విన్నర్ ఎల్విష్ యాదవ్ పేరు ఉండటం సంచలనంగా మారింది. ఎల్విష్ యాదవ్‌తో సహా ఆరుగురి పేర్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతం ఎల్విష్ యాదవ్‌ను పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు.

Prithiveeraj : తన కొడుకు కంటే చిన్న అమ్మాయితో పృథ్వి రాజ్ లవ్ స్టోరీ.. బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్ళలేదంటే?

నిందితుల నుంచి 5 నాగుపాములతో సహా 9 పాములు, పాము విషాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు పాములను అటవీ శాఖకు అప్పగించినట్లు తెలిపారు. పార్టీలలో విషాన్ని సరఫరా చేయడానికి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఈ విషాన్ని ఉపయోగించడం ప్రమాదకరమైనది మరియు ప్రాణాంతకమైనది. ఈ ఘటనపై బీజేపీ నేత మేనకా గాంధీ స్పందించారు. ఎల్విష్ యాదవ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.

మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను ఎల్విష్ యాదవ్ ఖండించారు. పోలీసుల దర్యాప్తులో తను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే పోలీసులు తనను అరెస్టు చేస్తారంటూ వచ్చిన వార్తలు అన్నీ ఫేక్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఎల్విష్ యాదవ్ ఈ సంవత్సరం ప్రారంభంలో బిగ్ బాస్ OTT సీజన్ 2 గెలిచి పాపులర్ అయ్యారు. యూట్యూబ్‌లో అతనికి 7.51 మంది సబ్ స్ర్రైబర్లు ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 16.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Elvish Raosahab (@elvish_yadav)