Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ ఇంట్లో ఆఖ‌రి నామినేష‌న్‌.. అయినా ఆగ‌ని మాట‌ల యుద్ధం..

Bigg Boss Telugu 7 Day 92 Promo : 14వ వారం ప్రారంభ‌మైంది. ఈ సీజ‌న్‌లో ఆఖ‌రి నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను బిగ్‌బాస్ మొద‌లుపెట్టాడు.

Bigg Boss Telugu 7 Day 92 Promo

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో 13 వారాలు పూర్తి అయ్యాయి. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో గౌత‌మ్ కృష్ణ ఎలిమినేట్ కావ‌డంతో ప్ర‌స్తుతం హౌస్‌లో ఏడుగురు ఉన్నారు. 14వ వారం ప్రారంభ‌మైంది. ఈ సీజ‌న్‌లో ఆఖ‌రి నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను బిగ్‌బాస్ మొద‌లుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రొమో విడుద‌లైంది. ఆఖ‌రి నామినేష‌న్స్ చేసే స‌మ‌యం వ‌చ్చింద‌ని బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌కు చెప్పాడు. ఎవ‌రినైతే నామినేట్ చేయాల‌ని భావిస్తారో వారి ముఖాన్ని టైల్ పై ప్రింట్ వేయాల‌ని, ఆ త‌రువాత ఆ టైల్‌ను ప‌గుల కొట్టాల‌ని బిగ్‌బాస్ సూచించాడు.

ఇక ఎప్ప‌టిలాగానే ఈ వారం కూడా నామినేష‌న్స్ చాలా వాడివేడిగా జ‌రిగాయి. ‘ఎవ‌రి మాట‌నో నువ్వు గుడ్డిగా పాలో అవుతున్నావు.’ అని చెబుతూ శోభాశెట్టిని ప్రిన్స్ యావ‌ర్ నామినేట్ చేశాడు. ఈ క్ర‌మంలో శోభా-యావ‌ర్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డిచింది. ఆ త‌రువాత శోభ వంతు రావ‌డంతో ఆమె యావ‌ర్‌, శివాజీల‌ను నామినేట్ చేసింది.

Animal Movie : ఆమీర్ ఖాన్ ఓల్డ్ వీడియోతో ‘యానిమల్’ని ట్రోల్ చేస్తున్న బాలీవుడ్..

అనంత‌రం రైతు బిడ్డ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌ను అమ‌ర్‌దీప్ నామినేట్ చేయ‌గా వీరిద్ద‌రి మ‌ధ్య కూడా మాట‌ల యుద్ధం కొన‌సాగింది. ఆ త‌రువాత శివాజీ, ప్రియాంక మ‌ధ్య కూడా వాద‌న‌లు జ‌రిగాయి. మొత్తంగా ఎవ‌రు ఎవ‌రిని నామినేట్ చేశారు. ఎవ‌రెవ‌రు ఈ వారం నామినేష‌న్స్‌లో ఉన్న‌రో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు