Bigg Boss 4 : ఈసారి కూడా అబ్బాయిలే.. అమ్మాయిలూ ఔట్..!?

Bigg Boss 4 : ఈసారి కూడా అబ్బాయిలే.. అమ్మాయిలూ ఔట్..!?

Updated On : December 20, 2020 / 12:50 PM IST

BiggBoss-4 : Harika And Ariyana Eliminated : ఈసారైనా బిగ్ బాస్ టైటిల్ విజేతగా అమ్మాయిలు గెలుస్తారనుకుంటే మళ్లీ నో ఛాన్స్.. ఎంతైనా బిగ్ బాస్ హౌస్..కదా.. ఏమైనా జరగొచ్చు.. మొదటి మూడు సీజన్లలో అబ్బాయిలే టైటిల్ ఎగరేసుకెళ్లారు. ఈసారైనా అమ్మాయిలకు ఇస్తే బాగుంటుందనకుంటే.. ఈసారి కూడా లేదని అనిపిస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. టాప్ 5 ఫైనలిస్టులో ఉన్న ఇద్దరూ అమ్మాయిలు హారిక, అరియానా ఎలిమినేట్ అయినట్టు తెలిసింది. అదేగాని నిజమైతే మళ్లీ అబ్బాయిలే టైటిల్ రేసులో ఉన్నట్టు.. ఈ ముగ్గురు అబ్బాయిల్లో ఎవరూ అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది.

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి మూడు సీజన్ లలో మహిళా కంటెస్టులుగా గట్టిపోటీనిచ్చారు. సీజన్ వన్‌లో హరితేజ, అర్చన ఫైనలిస్టులలో నిలిచారు. తొలి సీజన్ విన్నర్ గా శివబాలాజీ టైటిల్ దక్కించుకున్నారు. ఆ తర్వాతి సీజన్ 2లో టాప్ 2 నిలిచిన సింగర్ గీతామాధురి రన్నరప్ గా నిలిచారు. చివరివరకూ గీతామాధురినే గెలుస్తారనుకున్నారు. కానీ, ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ టైటిల్ దక్కించుకున్నారు.

ఇక మూడో సీజన్ వచ్చేసరికి చివరి వరకు అందరూ శ్రీముఖినే విన్నర్ అనుకున్నారు.. కానీ, అనుహ్యంగా రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ దక్కించుకున్నారు. శ్రీముఖి రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ టైటిల్ విజేత ఓటింగ్ ద్వారానే జరుగుతుందని నిర్వహికులు చెబుతూ వస్తున్నారు. మొదటి సీజన్ నుంచి పురుషులే టైటిల్ తన్నుకుపోతున్నారు. మహిళా విజేతలకు మాత్రం టైటిల్ దక్కించుకునే ఛాన్స్ రావడం లేదు. ఈ సీజన్ లోనైనా వస్తుందని అనుకుంటే నో ఛాన్స్ అనేది ఎక్కువగా టాక్ వినిపిస్తోంది.

టాప్ 5 ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారు. హారిక మినహా నలుగురు టాప్‌లో పోటీ పడుతున్నారు. అరియానా తన ఆటతీరుతో అభిమానులను సంపాదించుకుంది. సోహెల్… సింగరేణి బిడ్డ అంటూ అభిమానులకు చెరువయ్యాడు. తనదైన ఆటతో అభిమానులను ఆకట్టుకున్నాడు.

ప్రేమ, కోపం, స్నేహం అన్ని వేరియేషన్స్ చూపిస్తూ ప్రత్యేక అభిమానాన్ని చూరగొన్నాడు. అఖిల్ మొదటి నుంచి నెంబర్ వన్ కంటెస్టంట్‌గా ఆకట్టుకున్నాడు. అఖిల్ కూడా మోనాల్ విషయంలో తప్పా హౌస్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. మిస్టర్ కూల్ అభిజీత్ మొదటి నుంచి విన్నర్ అతడే అంటూ ఊహాగానాలు వస్తున్నాయి.

అనాధికారిక పోల్, ఆన్ లైన్ పోల్స్ అన్నింట్లోనూ అభిజిత్ టాప్ పోజిషన్ లో ఉంటున్నాడు.. అభిజిత్.. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని దాదాపు ప్రేక్షకుల్లో చాలామంది ఫిక్స్ అయిపోయారు. అందుకే ప్రతివారం అతడికే భారీ ఓట్లు వస్తు వచ్చాయి. ప్రస్తుతానికి అందిన సమచారం లీక్ ల ప్రకారం పరిశీలిస్తే.. మిస్టల్ కూల్ అభిజిత్ బిగ్ బాస్ 4 విన్నర్ అని చెప్పకనే అర్థమవుతుంది. అధికారికంగా తెలియాలంటే మరొకొద్ది గంటల్లో తేలనుంది.

డిసెంబర్ 20న బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ రోజు ఉదయం నుంచే షూటింగ్ మొదలైనట్టు సమాచారం. లీకైన సమాచారం ప్రకారం.. హారిక, అరియానా ఎలిమినేట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. హారిక ఐదో స్థానంలో.. అరియానా నాల్గో స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. టాప్ 3 లో అబ్బాయిలు ఉండగా.. అభిజిత్, అఖిల్, సోహెల్ ముగ్గురిలో ఎవరు విన్నర్ అవుతారు అనేది చూడాలి మరి.