BiggBoss 6 Day 48 : హౌజ్‌లో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?.. మెరీనాని అన్యాయం చేసేశారుగా..

హౌజ్ లో ఎవరు ఉండొచ్చు? ఎవరు ఉండకూడదు అని అందరి దగ్గరా ఓటింగ్ తీసుకున్నాడు నాగార్జున. హౌజ్ లో ఉండే అర్హత ఎవరికి ఉంది? ఎవరికి లేదు? అని కంటెస్టెంట్స్ అభిప్రాయాలని తీసుకున్నాడు..........

BiggBoss 6 Day 48 : హౌజ్‌లో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?.. మెరీనాని అన్యాయం చేసేశారుగా..

BiggBoss 6 Day 48 Voting for deserving and un deserving contestants in BiggBoss

Updated On : October 23, 2022 / 6:41 AM IST

BiggBoss 6 Day 48 :  బిగ్‌బాస్ సీజన్ 6లో ఇటీవల కంటెస్టెంట్స్ అందరికి క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అందరూ గేమ్ మీద ఫోకస్ పెట్టారు. ఇక శనివారం ఎపిసోడ్ లో వీకెండ్ కావడంతో కాసేపు అందర్నీ నవ్వించాడు నాగార్జున. శనివారం ఎపిసోడ్ లో హౌజ్ అందరితో ఒకటే గేమ్ ఆడించారు. అలాగే హౌజ్ లో ఎవరు ఉండొచ్చు? ఎవరు ఉండకూడదు అని అందరి దగ్గరా ఓటింగ్ తీసుకున్నాడు నాగార్జున. హౌజ్ లో ఉండే అర్హత ఎవరికి ఉంది? ఎవరికి లేదు? అని కంటెస్టెంట్స్ అభిప్రాయాలని తీసుకున్నాడు.

శనివారం ఎపిసోడ్ అంతా దీనిపైనే నడిచింది. హౌజ్ లో ఉండేందుకు అర్హుడు శ్రీహాన్ అంటూ ఎక్కువ మంది శ్రీహన్ కి ఓట్లు వేశారు. హౌజ్ లో ఏకంగా 9 మంది సభ్యులు శ్రీహన్ కి అనుకూలంగా ఓట్లు వేశారు. ఇన్నాళ్లు శ్రీహన్ తో గొడవ పడిన ఇనయా కూడా శ్రీహన్ కి ఓటు వేయడం ఆశ్చర్యం.

ఇక హౌజ్ లో ఉండే అర్హత ఎవరికి లేదు అనే దానికి మెరినాకి అందరికంటే ఎక్కువగా 9 ఓట్లు పడ్డాయి. మెరీనాతో క్లోజ్ గా ఉండే ఇనాయా, ఫైమా లాంటి వాళ్ళు కూడా మెరీనాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. హౌజ్ లో ఉండే అర్హత సాధించిన వాళ్ళల్లో ఎక్కువ ఓట్లు శ్రీహాన్, రేవంత్, సూర్య, గీతూలకు పడ్డాయి. ఇక హౌజ్ లో ఉండే అర్హత లేని వాళ్ళల్లో మెరీనాతో పాటు వాసంతి, రాజ్, అర్జున్ కళ్యాణ్ టాప్ లిస్ట్ లో ఉన్నారు. అనర్హుల ఓట్లు పడ్డ వాళ్లందరికీ బిగ్‌బాస్ ప్రత్యేక బ్యాడ్జీలు ఇచ్చాడు. నాగార్జున వీరందర్నీ ఆట తీరు మరింత మార్చుకోవాలని తెలిపాడు.

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య వీర బాధుడు మామూలుగా ఉండదట!

ఇక ఈ వారం నామినేషన్స్ లో మొత్తం 13 మంది ఉన్నారు. రేవంత్‌, బాలాదిత్య, రోహిత్‌, వాసంతి, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్‌, కీర్తి, శ్రీ సత్య, మెరీనా, రాజ్‌, ఫైమాలు ఏడో వారం నామినేషన్స్ లో ఉండగా మరి ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేటి అవుతారో చూడాలి.